మహిళలు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుంది
If the women are good then the house is good
శుక్రవారం సభను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు
ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు వృధా చేసుకోవద్దు
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మల్కాపూర్ గ్రామంలో శుక్రవారం సభకు శ్రీకారం
కరీంనగర్
మహిళల సమస్యల పరిష్కారానికే అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభ కు శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, భద్రతతో పాటు సమస్యల పరిష్కారానికి ఇందులో ప్రాధాన్యమిస్తామని తెలిపారు.
శుక్రవారం కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సభ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు కుటుంబం కోసం ప్రతి రోజు హెల్తీ ఫుడ్ తీసుకోవాలని సూచించారు. మహిళలు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుంది ఆ జిల్లా బాగుం టుందని పేర్కొన్నారు. జిల్లాలో వినూత్నంగా శుక్రవారం సభకు శ్రీకారం చుట్టామని, అంగన్వాడీ కేంద్రాలను గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తద్వారా సరైన సమయానికి పోషకాహారం లభించడంతోపాటు వైద్యపరంగా సూచనలు, సలహాలు అందుతాయని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య భద్రతతో పాటు వారి సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభ వేదికగా నిలుస్తుందని తెలిపారు. చిన్నారులు మహిళల సంపూర్ణ ఆరోగ్యానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. గర్భిణులకు సాధారణ ప్రసవాలు జరిగేలా యోగాతోపాటు సరైన సూచనలు, సలహాలు వైద్య సిబ్బంది అందిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్కారు అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ప్రైవేటు దీటుగా పనిచేస్తున్నాయని, ప్రజలంతా వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గర్భిణీలు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డబ్బును వృధా చేసుకోవద్దని, ప్రభుత్వాసుపత్రులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి పేదలు ఇబ్బందులు పడవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు స్కానింగ్ లు, పరీక్షలు చేస్తారని తెలిపారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దని, పోషకాహారం తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని పేర్కొన్నారు. అందరూ తమ ఇంటితోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారంతోపాటు సమాజంలో నెలకొన్న వివిధ రుగ్మతల నిర్మూలనకు శుక్రవారం సభ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యంపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్,
జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, ఎంపీడీఓ ప్రభు, సీడీపీఓ ఉమారాణి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ సంపత్, మహిళా శక్తి కో ఆర్డినేటర్ శ్రీలత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, సూపర్ వైజర్ అరుణ, టీచర్స్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్ ఆశవర్కర్స్, మహిళలు పాల్గొన్నారు.



