- Advertisement -
సలహాలు సూచనలు ఇస్తే మాపై నిందలు మోపుతున్నారు-బండి సంజయ్
If we give suggestions, we are blamed-Bandi Sanjay
రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణం లో ఇటీవల మరణించిన ఊరగొండ రాజు కుటుంబాన్ని కేంద్ర హోoశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు.
బండి మాట్లడుతూ నేత కార్మికుల కరెంటు బిల్లుల విషయంలో గత ప్రభుత్వం, కొత్త ప్రభిత్వం మోసం చేసింది. నేత కార్మికులకు రెండు పార్టీలు కలిసి 50 శాతం సబ్సిడీ ఇస్తామని మోసం చేశారు. ప్రభుత్వానికి మేము సలహాలు సూచనలు ఇస్తే మాపై నిందలు మోపుతున్నారు. నేత కార్మికులు పరిస్థితి పెనం నుండి పోయిల పడ్డట్టు అయ్యిందని అన్నారు.
నేత కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుతార్ని కి లెటర్ రాస్తాం. ఎన్ కన్వేషన్ కూల్చేసి తెలంగాణ ప్రజలకు సినీమా చూపిస్తున్నారు. హైడ్రా పై పూర్తి అవగాహన ప్రజలకు ఇవ్వాలి. పెద్దోళ్ళని కొట్టి చిన్నోళ్ళకు ఇవ్వాలి, తెలిసి తెలియక కొందరు ఇల్లులు కట్టుకున్నారు వాటిని కూలిస్తే ఎలా. జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరవేసి జైల్ పోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు పౌరుశం ఎటుపోయింది. స్కలం చెరువు ఎందుకు కూల్చడం లేదు. ఓవైసీ పై రేవంత్ రెడ్డి ద్వంద వైఖరి వ్యవహరిస్తున్నారు. సల్కం చేరులో కట్టిన కాలేజి లో చడుతున్న వారికి వేరే కాలేజీలో అడ్మిషమన్ ఇచ్చి అనుమతి లేని భవనాలు కూల్చాలి. ఓవైసీ మాపై చేయి వేస్తే అంతు చూస్తామని హెచ్చరించడంతో వెనక్కు తగ్గిన రేవంత్ రెడ్డి.రైతు రుణమాఫీ 47 వెయిలా కోట్లు విడుదల చేస్తామని చెప్పి 17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసారు. రైతు రుణమాఫీ అనేది బోగస్. హైడ్రా పేరుతో ఆరు గ్యారంటీ లు పక్క దోవ పట్టిస్తున్నారు. సుప్రీం కోర్టు విషయంలో అందరూ జాగ్రత్తగా మాట్లాడాలి. కవిత కోసం మాట్లాడిన అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సీటు కోసం ఎందుకు నామినేషన్ ఎందుకు వేయలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని ప్రజలకు తెలుసు.రేపు ఎల్లుండో యువరాజు కు అప్పగింతలు అమెరికాలో జరుగుతున్నాయని అన్నారు.
- Advertisement -