- Advertisement -
ప్రకృతిని మనం ప్రేమిస్తే – ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది
If we love nature - nature loves usరుద్రవరం,
ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుందని అప్పుడే మనం అందరం ఆరోగ్యంగా జీవించగలమని మండల ప్రత్యేక అధికారి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు అన్నారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన రుద్రవరంలో మంగళవారం ఇన్చార్జ్ ఎంపీడీవో ఏవో వరలక్ష్మి ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేయకు చెత్త – చేయకు పాపం, పరిసరాల పరిశుభ్రం – పర్యావరణం భద్రం, అపరిశుభ్రత నివారిద్దాం – వ్యాధులను నిరోధిద్దాం, ఒకటే మాట – పరిశుభ్రత బాట, ఆరోగ్యం – మన అందరి బాధ్యత, చెత్తను రోడ్లపై వేయకండి -డ్రైనేజీలను చెత్తతో నింపకండి, పరిసరాల పరిశుభ్రం – ప్రతి ఒక్కరి కర్తవ్యం, ఇంటింటా మరుగుదొడ్డి – ఊరంతా ఆరోగ్యం, ఈ వీధి ఈ గ్రామం మనది మనది -పరిసరాల పరిశుభ్రత బాధ్యత మనది మనది అంటూ నినాదాలు చేస్తూ మెయిన్ బజార్లో ర్యాలీ నిర్వహించి అమ్మవారి శాల నాలుగు రోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి నాగరాజు మాట్లాడుతూ గ్రామాలు స్వచ్ఛతగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలను ఈనెల 17 నుండి అక్టోబర్ ఒకటో తేదీ వరకు గ్రామ పంచాయతీల నందు నిర్వహించాలని ఆదేశించడం జరిగిందన్నారు. మండలంలోని 21 గ్రామ పంచాయతీల నందు పంచాయతీ కార్యదర్శులు ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు గ్రామంలోని హోటల్లు దుకాణాల వద్ద శుభ్రంగా ఉంచుకోవాలని రోడ్ల వెంట చెత్త వేయరాదని గ్రామస్తులకు అవగాహన కల్పించామన్నారు. ప్రధాన రహదారుల్లో హోటల్ దుకాణాల వద్ద శుభ్రం చేసిన తర్వాత చెత్త వేసినట్లయితే సంబంధిత హోటలు, దుకాణం యజమానికి జరిమానా విధిస్తామని తెలిపారు. పరిశుభ్రతపై ప్రజలను మమేకం చేస్తూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్నారు. ప్రధానంగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, అతిసార మలేరియా వ్యాధుల నివారణకు ముఖ్యంగా ప్రజలు పరిశుభ్రతను పాటించాలని పారిశుద్ధ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూ సూచించారు. తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను బాధ్యతగా తీసుకోవాలని ఈ కార్యక్రమంలో భాగంగా రోజు ఓ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఓపిఆర్డి శ్రీనివాస శర్మ, ఎంఈఓ లు శివకోటయ్య, లక్ష్మీ, ఏపిఎం కల్పలత, ఏపీవో ప్రతాప్, ఈవో సుబ్బారావు, బైరి బ్రహ్మం, టిడిపి మండల నాయకుడు ఎల్వి రంగనాయకులు శెట్టితో పాటు పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు, వెలుగు సిబ్బంది, ఉపాధి సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




