- Advertisement -

ఈనెల 6 నుంచి గో మహా పాదయాత్ర
ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి ప్రారంభం
హైదరాబాద్: సేవ్ కౌ సేవ్ ఎర్త్ అనే నినాదంతో బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి గో మహా పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు అఖిలభారత గో సేవా ఫౌండేషన్ మీడియా కోఆర్డినేటర్ రవి గుడాల తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను సోమాయిగూడ ప్రెస్క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోమాతను రక్షించడం ద్వారానే భూమాతను రక్షించుకోగలమని అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతోనే గో మహా పాదయాత్ర ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 25 రోజులపాటు 789 కిలోమీటర్లు కొనసాగుతుందని చెప్పారు. 100 మంది గోవింద మాల శివమాల లు ధరించి సాగే ఈ యాత్రను దత్త పీఠం స్వామి దత్త విజయానంద ప్రారంభిస్తారని తెలిపారు.
- Advertisement -



