పోకిరీలు వేధిస్తే నేరుగా షీ టీంకు ఫోన్ చేయాలి

- Advertisement -

పోకిరీలు వేధిస్తే నేరుగా షీ టీంకు ఫోన్ చేయాలి

If you are harassed by hooligans, you should call the She team directly

కమాన్ పూర్
రోడ్లపై పోకిరీలు వేధిస్తే నేరుగా షి టీంకు ఫోన్ చేయాలి అని ఇన్చార్జి స్నేహలత అన్నారు. సోమవారం
రామగుండం సి.పి   ఆదేశాల మేరకు, సుల్తానాబాద్ లోని వివేకానంద  హై స్కూల్ మరియు కాలేజీ విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సు  నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా షీ టీం ఇంచార్జ్ ఏ ఎస్ ఐ మల్లన్న మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై మరియు ఆంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్ మరియు ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందని , ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు  ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే  సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి  సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. మరియు ఆకతాయిల నుండి ఎలా రక్షణగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షి టీమ్ సభ్యురాలు స్నేహలత  మరియు కరెస్పాండంట్ రవీందర్, ప్రిన్సిపాల్ సాయి కిరణ్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular