బీఆర్ఎస్ కు పోటే లేదు
మంత్రి జగదీష్ రెడ్డి
నల్గోండ: ముందస్తు టికెట్ల ప్రకటన పై ప్రతిపక్షాల కామెంట్ల పై మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముందస్తు టికెట్ల ప్రకటనతో ప్రతిపక్షాలన్నీ కకావికలం అయ్యాయి. బీఆర్ఎస్ లో అసంతృప్తి వస్తదని అనుకున్నవారికి ఆశాభంగం అయ్యింది. కేసీఆర్ నిర్ణయం పై అందరికి పూర్తి విశ్వాసం ఉంది. బీఆర్ఎస్ నాయకులు క్రమశిక్షణ గల కార్యకర్తలు. అందరు పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తారు. కేసీఆర్ ని వదులుకుంటే మళ్లీ కష్టాలే. ప్రతిపక్షం వస్తే మూడు గంటల కరెంట్ భూముల రికార్డ్ తారుమారు అవుతాయి. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శరణ్యం. 75 ఏళ్లుగా కాంగ్రెస్ , బీజేపీ లు ప్రజలను మోసం చేశాయి. 10 ఏళ్లలో ప్రతిపక్షాల పాలనలో జరిగిన నష్టాన్ని పూడ్చి కుదుటపడుతున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ని గెలిపించుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కేసీఆర్ దెబ్బకు ప్రతిపక్షాలకు దిక్కుతోచడంలేదని అన్నారు. పోటీ పడి రాహుల్ గాంధీ మోడీ అనుచరులు అసంతృప్తుల కోసం కాగడా పట్టి వెతుకుతున్నారు. అభ్యర్దుకు లేక నోటిఫికేషన్లు ఇచ్చుకుంటున్నారు. అసలు తెలంగాణాలో బీఆర్ఎస్ కి పోటీనే లేదు. 119 నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరు. కాంగ్రెస్ కి 50 మంది అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉంది , బీజేపీ కి ఉన్న మూడు నిలబెట్టుకోవడం గగనంగా మారింది. తెలంగాణాలో ఇంచు మించు కాంగ్రెస్ , బీజేపీ ల పరిస్థితి ఒక్కలాగే ఉంది. ఎడవలేక నవ్వుతూ ప్రతిపక్షాలు ప్రగల్బాలు పలుకుతున్నారు. ఉమ్మడి నల్లగొండకు అద్భుతమైన క్రికెట్ టీమ్ ఇచ్చారు కేసీఆర్. కచ్చితంగా కప్పుకొట్టి కేసీఆర్ కి బహుమతిగా ఇస్తాం. పెద్దపెద్ద నాయకులని మట్టి కురిపించారు మా ఎమ్మెల్యేలు. రెండు చోట్లా పోటీ చేస్తే మీకే మంచిదిగా ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకోవొచ్చు. గజ్వేల్ వదిలి ఆయన టిక్కెట్లు ఇచ్చిన వారిపై ముందు పోటీ చేసి చూపండని అన్నారు. రెండు చోట్ల కేసీఆర్ పోటీ పై ప్రతిపక్షాలవి చిల్లర మాటలు. మేము ఓడగోడితే సానుభూతితో ఎంపీలైన వారు ఉత్తర ప్రగల్బాలు పలుకుతున్నారు. మీడియాలో హైప్ కోసమే ప్రతిపక్షాల ఆరాటం. ఎక్కడ పోటీ చేసినా కేసీఆర్ అప్రతిహాసంగా గెలిచారు. ప్రతిపక్షాల్లాగా తాము మాట్లాడితే వారికి చెమటలే. ప్రతిపక్షాలు చిల్లర మాటలు మానుకోవాలని అన్నారు.