- Advertisement -
దమ్ముంటే ఫార్ములా ఈ పై అసెంబ్లీ లో చర్చ పెట్టాలి
If you have dare discuss about formula E in assembly
కేటీఆర్
హైదరాబాద్
అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కెటిఅర్ మాట్లాడారు. సియం రేవంత్ కు దమ్ముంటే ఫార్మూలా-ఈతోపాటు ప్రభుత్వం చేస్తున్న స్కాముపైన అసెంబ్లీలో చర్చ పెట్టండి. కానీ రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చకు పెట్టె దమ్ములేదు. మీ అరోపణలపై సభలో వివరాలు ఇవ్వండి… ప్రజల ముందు నిజాలు ఉంచండని అన్నారు.
అసెంబ్లీలో చర్చ పెడితే ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయించుకుంటారు. రేవంత్ రెడ్డి లీకులిచ్చి రాజకీయ దుష్ర్పచారానికి పాల్పడుతున్నారు. ఫార్ములా ఈ, ఇతర స్కాములంటూ అసత్యాలను ప్రచారం చేసే కన్న సభలో చర్చ పెడితే నిజాలు తెలుస్తాయి. చర్చ నాలుగు గోడల మద్య కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. లీకు వీరుడు సిఎం ఇచ్చే లీకులే తప్ప నిజాలు అధికారికంగా చెప్పె దమ్ములేదు. ఈ ఫార్ములా రేసులో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదని అన్నారు.
న్యాయంగా వ్యవహరించే, ప్రభుత్వ అరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వేంటనే కేసు కొట్టేస్తారనే నమక్మముంది. అధికారికంగా చెప్పే దమ్ములేక క్యాబినెట్ లో నాలుగు గంటల చర్చ అంటూ వార్తలు రాపిస్తున్నారు. కెబినెట్ అంటే గాసిప్ బ్యాచ్ లెక్క తయారైంది. నిజాలు చెప్పే దమ్ము లేఖ సిఎస్ తో నోటీసులు, అనుమతులు అంటూ లీకులిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్ధానిక సంస్ధల చట్టాల సవరణలను వ్యతిరేఖిస్తున్నాం. ఈ చట్ట సవరణ వలన బిసిలకు పూర్తి అన్యాయం జరుగుతుంది. బిసిలకు ఇచ్చిన 42 శాతం హమీ గంగలో కలిసినట్టే అవుతుంది. ఎన్నికల కోసం హమీలిచ్చి ఇప్పుడు 2010 సుప్రీం కోర్టు కేసును చట్టంలో ప్రస్తావిస్తుంది. 42శాతంరిజర్వేషన్లును పక్కన పెట్టేలా ప్రత్యేక బిసి కమీషన్ సిఫార్సులు, ట్రిపుల్ టెస్ట్ పాస్ . కావాలి అంటూ కొత్త మెలికలు పెడుతుంది ఈ అంశంలో అన్ని పార్టీల మద్దతున్న నేపత్యంలో ఈ చట్ట సవరణలోనే బిసిలకు 42 శాతం రిజర్వేషన్ అని నిబంధనలు పెట్టండి.. చట్టం చేయండని అన్నారు.
కోర్టుల అంగీకరించకుంటే అవసరం అయితే రాజ్యంగ సవరణ కోసం కేంద్రానికి పోదాం. బిజెపి కాంగ్రెస్ కలిసి పార్లమెంట్ లో రాజ్యంగ సవరణ చేయవచ్చు. కానీ బిసిలను మోసం చేసేందుకే ఈ సవరణలను కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన స్ధానిక సంస్ధల చట్టాల సవరణలను వ్యతిరేఖిస్తున్నాం. ఈ మేరకు నేరుగా చట్టంలో 42 శాతం బిసి రిజర్వేషన్లు ఇవ్వాలని సవరణలు కోరాం. ఈ అంశంలో సభలో ఓటింగ్/ డివిజన్ అడుగుతాం. ఒక వేళ ఈ చట్టం అమలు అయితే బిసిలకు రిజర్వేన్లు దక్కవని అన్నారు.
- Advertisement -


