తప్పుడు ప్రచారం చేస్తే నాశనమైపోతావు కేటీఆర్
మంత్రి సీతక్క
ములుగు
If you spread false propaganda, you will be destroyed, KTR
Minister Seethakka
తప్పుడు ప్రచారం చేస్తే నాశనమైపోతావు కేటీఆర్ అంటూ ఫైర్ మంత్రి సీతక్క అయ్యారు. చిల్లర రాజకీయాలు మానండి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వివరించండి. కేటీఆర్ మీ చెల్లి నీ మీద దుమ్మెత్తి పోస్తుంది.. ఆమె సంగతి ఏందో చూడు . నాతో పెట్టుకుంటే నీకు వచ్చేది ఏం లేదు. నీలాగా కుల బలము తన బలము అహంకార బలము నా వద్ద లేదు. నాకెవరూ లేరు. ఉన్న అన్న కూడా ఉద్యమంలో చనిపోయాడు. నాకు నియోజకవర్గమే నాకు అండ. ములుగు ప్రజలు దీవిస్తే మంత్రిని అయ్యానని అన్నారు.
నువ్వు నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కు నేను మంత్రయితే కేటీఆర్ తట్టుకోవట్లేదు. అభివృద్ధికి అందరూ సహకరించండి. అబద్ధపు ప్రచారంతో కేటీఆర్ నాశనమైపోతాడు. ఇంట్లో ఆడబిడ్డను నువ్వు కుట్రలు కుతంత్రాలతో వేధిస్తున్నావు. ములుగులో ఇందిరమ్మ పాలన ప్రజాస్వామ్య పాలన సాఫీగా సాగుతోంది . ఇబ్బందులు నిర్బంధాలు లేవు . నా మీద ఉన్న అభిమానాన్ని, ములుగు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారు . పక్క నియోజకవర్గాలలో చిత్తుగా ఓడిపోయి అక్కడ ఎవరు పట్టించుకోక ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు. కేటీఆర్ నిజంగా మనిషి అయితే పోలీసు రాజ్యం ములుగులో ఉందని నిరూపిస్తావా? మీ హాయంలో మా కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు . లక్ష్మీదేవి పేట, చల్వాయి తో పాటు ఎన్నో గ్రామాల యువకుల మీద మీరు కేసులు పెట్టి వేధించారు..చర్చకు సిద్ధమా? ములుగు లో శాంతియుత వాతావరణం ఉంది ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందని అన్నారు.
దొర దురంకారంతో కుట్రలను రాష్ట్ర ప్రజలు ములుగు ప్రజలు అర్థం చేసుకున్నారు. మీరు శాంతియుత ధర్నా చేసుకుంటామని చెప్పి మంత్రుల కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేశారు . మీకు రాజకీయ డ్రామాలు తప్ప.. బాధిత కుటుంబాలను ఆదుకునే సోయి లేదని అన్నారు.
ములుగు నియోజకవర్గంలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ పోలీస్ అధికారులు ఉన్నారు. వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీ హయంలో ములుగు నియోజకవర్గంలో మీ మంత్రులు పర్యటిస్తే విపక్ష నేతలను హౌస్ అరెస్టులు చేసేవారు . తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు మీరు. చల్వాయిలో రమేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకుంటే.. మమ్మల్ని నిందించడానికి బుద్ధి ఉండాలి. ఆ కుటుంబాన్నీ పరమార్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చామని అన్నారు. మీరు ప్రజలను పొట్టన పెట్టుకుంటే.. మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం. మీ పాలనలో టిఆర్ఎస్ నేతల వేధింపులకు ఎందరో బలయ్యారు. సూసైడ్ లేఖలు, సెల్ఫీ వీడియోలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. సిరిసిల్లలో ఇసుక లారీలతో ప్రజలను తొక్కించి చంపించిన చరిత్ర మీది. మంథనిలో అడ్వకేట్ దంపతులను నరికి చంపింది ఎవరు . సిద్దిపేటలో ఆటో డ్రైవర్ శిలాసాగరం రమేశ్ కు డబల్ బెడ్ రూం రాకుండా మీ టీఆర్ఎస్ కౌన్సిలర్ అడ్డుకుంటే సిద్దిపేట కలెక్టరేట్ వద్ద పురుగు మందు తాగి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.
కొత్తగూడేం అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు బీఆర్ఎస్ నేత రాఘవేంద్ర వేధింపులు తాళలేక ఓ కుటుంబం సుసైడ్ చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట లో మీ నేతలు వేధిస్తున్నారని తల్లి, కొడుకు పద్మ,సంతోష్ సెల్ఫీ తీసుకుని పెట్రోల్ పోసుకుని సుసైడ్ చేసుకున్నారు. మీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరింపులతో ఖమ్మంలో సాయి గణేష్ అనే యువకుడు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఎందరో మీ వేధింపులకు బలి అయితే.. ఆ కుటుంబాను కనీసం పరామర్శించలేదని అన్నారు.
ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించే కేటీఆర్ కు సంస్కారం లేదు.. కేటీఆర్ కు ఒళ్లంతా దూరంకారమే. ఉద్యమ సమయంలో జనాలను రెచ్చగొట్టి చనిపోయేలా చేసి మీరు మాత్రం అధికారం అనుభవించారు . బీఆర్ఎస్ s పదేళ్ల పాలనలో ములుగులో కనీసం వేయి ఇండ్లు కట్టించి ఇవ్వలేదు.. మీకు మాట్లాడే అర్హత ఉందా? అధికారం కోసం చావులకు ప్రేరేపించిన చరిత్ర మీదని అన్నారు.


