శ్రీధర్ బాబుకు ఓటేస్తే అన్నదమ్ములిద్దరు ప్రజాసేవ చేస్తుండ్లు
వారి సేవలను ఓర్వలేకనే విమర్శలు చేస్తున్న పుట్ట మధు
-ప్రభుత్వ కార్యాలయాలు సైతం అత్యంత హంగులతో నిర్మించాలనేది మంత్రి శ్రీధర్ బాబు ఆలోచన
-అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు
-పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక
మంథని ప్ర
If you vote for Sridhar Babu, both brothers will be doing public service
శ్రీధర్ బాబు కు ఒక్క ఓటు వేస్తే ఆ ఒక్క ఓటుతో ఇద్దరు అన్నదమ్ములు ప్రజలకు పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రజల కోసం,వారి కార్యకర్తల కోసం అనుక్షణం పని చేస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వొడ్నాల శ్రీనివాస్, ఎరుకల ప్రవీణ్, నూకల బానయ్య, మంథని సత్యం, ఆర్ల నాగరాజు లు పేర్కొన్నారు. బుధవారం మంథని ప్రెస్ క్లబ్ లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు మారుపేరైన పుట్టమధు మా నాయకులను విమర్శించడం దొంగే దొంగన్నట్లు ఉందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఆయన సోదరుడు శ్రీనుబాబు లకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే వారిపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు మీలాంటి దొంగలను దృష్టిలో పెట్టుకొనే ఎవరు బెదిరించిన డబ్బులు ఇచ్చి పనుల్లో నాణ్యత లేకుండా చేయొద్దు అని తెలపడం జరిగిందని అట్టి విషయన్ని వక్రీకరించి మాట్లాడటం సిగ్గు చేటు అని అన్నారు.నువ్వు నీ కుటుంబ సభ్యులు, కమీషన్లు కక్కుర్తి పడే మిషన్ కాకతీయ, భగీరథ, రోడ్లు, బ్రిడ్జి ల పనుల్లో కాంట్రాక్టర్లు ను బెదిరించి కోట్ల రూపాయల సంపాదించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
నువ్వు రాజాగృహ కట్టుకుంటే సరిపోదు ప్రభుత్వ, మున్సిపల్ భవనాలు కూడా అత్యంత హంగులతో నిర్మించాలి అనేది మంత్రి శ్రీధర్ బాబు ఆలోచన అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల ద్వారా ఏ వ్యక్తి ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. నువ్వు పదవి కోసం కమాన్ పూర్ పోయవనే విషయం మరిచి నువ్వు స్థానికత గురించి చెప్పడం ఏందన్నారు.కెసిఆర్ గజ్వేల్ లో పుట్టడా? కేటీఆర్ సిరిసిల్ల లో పుట్టడా?ఎవరైనా ఎక్కడ నుంచి అయినా పోటీలో ఉండొచ్చు అన్నారు.నువ్వు 2014లో ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి బెదిరింపులకు పాల్పడి కమిషన్లు తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
దొంగే దొంగ అన్నట్లుగా ని వ్యవహారశాలి ఉన్నది నీకు దమ్ముంటే ఆధారాలతో ప్రజల ముందు నిరూపించాలని సవాల్ విసిరారు. నువ్వు కమీషన్లు తీసుకున్నావు కాబట్టే ఇవాళ నీకు ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయన్నారు.మంథని మున్సిపల్ ఆఫీస్ ని మున్సిపల్ పరిధిలో వైభవంగా అన్ని అధునాతన సౌకర్యాలతో నిర్మించడం కోసం శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కు అనువైన స్థలం కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.మున్సిపల్ ప్రజల ఆహ్లాదం కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టాలని అన్నారు, మంథనిలో ఉండే ప్రతి ఒక్కరూ అభివృద్ధి పొలాలను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని శ్రీధర్ బాబు అన్నారని నాయకులు తెలిపారు.రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ను ఎమ్మెల్యేలు అని ఏకవచనంతో సంబోధించడం నీ అహంకారానికి, ఆవివేకానికి నిదర్శనం అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి మున్సిపల్ ఆఫీస్ కూడా నిర్మించలేని నువ్వు, అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకోవాలని చూస్తే ఉరుకునేది లేదని నాయకులు హెచ్చరించారు.ఈ పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలు శివ, బూడిద శంకర్, జనగామ నర్సింగరావు, పేరవేన లింగయ్య, గోటికర్ కిషన్ జి, ఐలి శ్రీనివాస్, పర్శవెన మోహన్ యాదవ్, ఆర్ల నారాయణ,పార్వతి కిరణ్, కందుకూరి రామ్మూర్తి, రేపాక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.