ఓటేస్తే.. ఉచితంగా కంటి పరీక్షలు
చికిత్స, సర్జిరీలపై 10 శాతం డిస్కౌంట్
ఈ నెల 13 నుంచి 25 వరకు
వాసన్ ఐ కేర్ ఎలక్షన్ ఆఫర్
దేశంలో ప్రఖ్యాతిగాంచిన వాసన్ ఐ కేర్ సంస్థ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ఈ నెల 13 ఓటేసిన తర్వాత వేలికి ఉన్న ఇంక్ ను తమ ఐ కేర్ సెంటర్ లో చూపిస్తే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. అంతేగాకుండా ఉచిత కంటి పరీక్షలు తర్వాత చేసే అవసరమైన సందర్భంలో చేసే చికిత్సకు, సర్జరీలకు కూడా ఆఫర్ ను ప్రకటించింది. ఓటు వేసిన వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటుగా చికిత్సకు, సర్జరీ చేస్తే వాటిలో డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. చికిత్స, సర్జరీలకు విధించే చార్జీలలో 10 శాతం వరకు తగ్గింపును అందిస్తామని ఆ సంస్థ తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ ను ఈ నెల 13 నుంచి 25 తేదీ వరకు వినియోగించుకోవచ్చునని వెల్లడించింది. ప్రజాస్వామ్యబద్దంగా లభించిన ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో మరింత చైతన్యం, అవగాహన కలిగించేందుకు ఈ తరహా ప్రకటన చేసినట్లు వాసన్ ఐ కేర్ పేర్కొంది. ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ చాలా మంది వినియోగించుకోవడం లేదని, రాజ్యాంగం ద్వారా లభించిన హక్కు పట్ల నిర్లక్ష్యం వహించకుండా వినియోగించుకునేలా ఓటర్లలో అవగాహన, ఉత్సాహం కలిగించేందుకు ఓట్ ఫర్ బెటర్ నేషన్ అనే నినాదంతో తాము ఉచిత కంటి పరీక్షలతో పాటుగా, తగ్గింపు ధరలను అమలు చేస్తున్నమని ఆ సంస్థ తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఉన్న వాసన్ ఐ కేర్ సెంటర్ల నoదు సంప్రదించవచ్చునని, ఈ సదావకాశాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని వాసన్ ఐ కేర్ సంస్థ పిలుపునిచ్చింది.