మంత్రి తన్నీరు హరీష్ రావు
హుస్నాబాద్ నవంబర్ 21: చిగురుమామిడి మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్, బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ మాజీమంత్రి పెద్దిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువనేత ఇంద్రనీల్ లతో కలిసి ఐ ఓ సి పెట్రోల్ పంపు నుండి చిగురుమామిడి బస్టాండ్ చౌరస్తా వరకు వేలమంది గులాబీ శ్రేణులు, ఒగ్గుడోలు, కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, బతుకమ్మలు, బోనాలతో మహిళలు, యువకులు కదిలి రాగా మంగళవారం రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.
హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ 2014, 2018లో ఆశీర్వదించారు నియోజకవర్గాన్ని వేల కోట్లతో అభివృద్ధి చేశాను మున్ముందు నియోజకవర్గ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నా ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మూడవసారి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎలక్షన్లప్పుడు కనబడే టూరిస్టులను నమ్మవద్దని గుట్టలు మాయం చేసేందుకు ప్రతిపక్ష పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని వారి కుట్రలకు గురికావద్దని ప్రజానీకానికి తెలిపారు.
హరీష్ రావు మాట్లాడుతూ సతీషన్న గెలుపు ఖాయం అయిందని అందరివాడు, పేదల పక్షపాతి, చదువుకునే పిల్లలకు అన్నం పెట్టి, ఆకలి తీర్చాడు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాడు, నియోజకవర్గానికి రోడ్లు, విద్య, వైద్య మౌలిక సదుపాయాల రంగాలలో అభివృద్ధి చేసిండు ఆశీర్వదించండి అని కోరారు. ఎలక్షన్లు అంటే మూడురోజుల పండుగ కాదు, ఐదేళ్ల భవిష్యత్తు అని ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు తెలంగాణ ఎలా అభివృద్ధి జరిగింది ప్రజలలో చర్చ పెట్టాలని, కాంగ్రెస్, ఎర్రజెండా పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చెందలేదని సతీషన్న ఎమ్మెల్యేగా హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అయింది, అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఐఓసీ బిల్డింగ్ ఓపెన్ చేసుకున్నాం, ప్రభుత్వ ఆస్పత్రి సామర్ధ్యాన్ని పెంచుకున్నాం, అవసరమైన నిధులు తెచ్చుకున్నామని, చిగురుమామిడి మండలానికి గోదావరి నీళ్లు తెచ్చానని ఇంకా మిగిలిన అన్ని గ్రామాలకు ఎన్నికల తర్వాత గోదావరి జలాలు అందిస్తానని చెరువులు ఎండాకాలంలో మత్తడులు దుంకుతున్నాయి
పుష్కలంగా పంటలు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మహిళా సమైక్య, వివిధ సామాజిక భవనాలు నిర్మించుకున్నామని, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సౌభాగ్యం విలసిల్లుతున్నదని గ్రామ గ్రామానికి రోడ్లు, మురుగునీటి కాలువలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించుకుందామని దేశంలో 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పాలనలో లేని అభివృద్ధి గడిచిన 9ఏళ్లలో చేసి చూపించామని హరీష్ రావు అన్నారు.
కర్ణాటకలో 5 గ్యారంటీలు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బోల్తా పడ్డది ఇప్పుడు మనకు 6 గ్యారంటీలు అని వస్తున్నారు వారి మాటలు విని ఆగం కావద్దని ప్రజానీకానికి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు ఇప్పటికే కర్ణాటక ప్రజలు మేము ఆగమయినం మీరు ఆగం కాకండి అని తెలంగాణ ప్రజలను కోరుతున్నారు అప్పుడు బిజెపి అధికారంలో ఉన్నప్పుడు 7,8 గంటల కరెంట్ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 3 గంటల కరెంటు ఇస్తుంది అన్ని ధరలు పెంచిర్రు అని బాధపడుతున్నారని కాంగ్రెస్ వాళ్ల పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియదా ఉచిత కరంటు అన్నారు ఉత్త కరెంటుచేసిండ్రు, వారి పాలనలో ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టి నిలబడ్డ రోజులు ప్రజలు మర్చిపోవద్దని హరీష్ రావు అన్నారు. వ్యవసాయానికి ఎన్ని గంటలు కరెంటు అవసరమో తెలియని వ్యక్తి పిసిసి అధ్యక్షుడు అయ్యాడని హరీష్ రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలలో చర్చ పెట్టండి, 2023 బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అంశాలను అందరికీ వివరించాలని పిలుపునిచ్చారు. చిగురు మామిడి మండల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేస్తామని అలాగే ఓగులాపూర్ గ్రామ సమస్య స్వయంగా మీ ఊరికి వచ్చి నేను పరిష్కరిస్తానని ఆర్&ఆర్ ప్యాకేజీ కావాల్నా, మీ భూములు మీకు కావాల్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా మీరే నిర్ణయించుకోండి మీరు ఏది చెప్తే అది సతీషన్న నేను మీకు చేసి పెడతామని గ్రామస్తులకు హరీష్ రావు భరోసానిచ్చారు. రుణమాఫీ ఆపింది కాంగ్రెస్ వాళ్లేనని ఇప్పటివరకు 14వేల కోట్లు రుణమాఫీ చేశాము మిగిలిన 4000 కోట్లు ఎలక్షన్ల తర్వాత కచ్చితంగా చేస్తామని హరీష్ రావు మాటిచ్చారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ ను మూడవసారి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా హరీష్ రావు తెలియజేశారు.
హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా చిగురుమామిడి మండలం వివిధ గ్రామాల నుండి వందలాది మంది వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి గులాబీ కండువా కప్పి హరీష్ రావు, సతీష్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు.