తుర్కపల్లి మండలంలో పర్యటించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
Ilaiyya MLC Mallanna of Whip Birla who toured the mandal
యాదగిరిగుట్ట (వాయిస్ టుడే ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పర్యటించారు.
తుర్కపల్లి మండలం బద్దు తండ గ్రామంలో వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు.అనంతరం సిత్లా పండుగ సందర్భంగా బంజారాలతో కలసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారూ.
ఆతర్వాత తిరుమలపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. నాటిన మొక్కలన్నిటిని ప్రతి ఒక్కరూ సంరక్షించాలని కోరారు.
అనంతరం గంధమల్ల గ్రామంలో గంధమల్ల నుండి భువనగిరి వరకు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించి ప్రారంభించారు.ఆ తర్వాత కొద్దిదూరం వరకు బస్సులో ప్రయాణించారు. అంతకుముందు వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన నీటిని తాగాలని ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు



