- Advertisement -
ఐపిఎం లో అక్రమ ప్రమోషన్లు.. కోర్టు దిక్కార చర్యలు
Illegal promotions in IPM.. Court actions
హైదరాబాద్ అక్టోబర్ 11
;నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రత్యేక ఎజండా తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లోని ఐ. పి. ఎం. నారాయణ గూడలో ఎదేచ్చగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన పి ఎం ఎస్. కె కుమార్ కు తెలంగాణ రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకం గా తాత్కాలిక పదోన్నతులు కల్పించడం జరిగినదని సాటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఐ. పి. ఎం డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న డా.శివలీలా పీఎంఎస్ కే కుమార్ కు కల్పించి న అక్రమ ప్రమోషన్లను సమీక్షించి రివర్షన్ ఇవ్వకుండా చట్టాన్ని, సుప్రీం కోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతారు చేస్తూ, కొనసాగించడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు డబ్ల్యూ పి నెంబర్ 1284/2020 స్టే ఆర్డర్ మరియు జీవో ఎంఎస్ నెంబర్ 106 ఫైనల్ బై ఫర్ కేషన్ అయినా కానీ పి ఎమ్ ఎస్ కె కుమార్ తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఇంకో ప్రమోషన్ తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ మెమో నెంబర్ 6307/జి /2022-1 వైద్య ఆరోగ్యశాఖ తేదీ: 01-09-2022, డబ్ల్యూపీ నెంబర్ 26476/2022 యొక్క ఉత్తర్వులు మరియు డబ్ల్యూ పి నంబర్ 14588/2014 & ఎస్ ఎల్ పి సి నెంబర్ 015516/2024 ఉత్తర్వులను అమలు చేయకుండా,ఎల్ ఎస్ వన్ గా కొనసాగిస్తున్నారని తెలిపారు. అతనికి రివర్శన్ చేయకుండా సీనియర్ ధీమతిలక్ష్మి చిన్న పోస్టులో పి ఎం ఎస్ కే కుమార్ జూనియర్ అయ్యుండి పెద్ద పోస్టులో విధులు కొనసాగిస్తున్నారని, తాత్కాలిక ప్రమోషన్ల లో చెల్లించబడిన జీతం రికవరీ చేయమని ఉన్న ఉత్తర్వులను బేఖాతారు చేస్తూ తెలంగాణ ఉద్యోగులకు మాత్రం చట్టభద్ధంగా రావలసిన ప్రమోషన్లను అడ్డుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మెమో లు ఇవ్వడం దూర ప్రాంతాలకు బదిలీ చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని, ప్రమోషన్ ఇవ్వమని కోర్ట్ ఉత్తర్వులు తెచ్చుకున్న ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక అధికారిని ఉద్యేశ్య పూర్వకంగా ఆదిలాబాద్ లో పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.. ఐ. పి. ఎం. డైరెక్టర్ డా. శివలీల, పి. ఎం. ఎస్. కే కుమార్, అనిల్ కుమార్ ఒక గ్రూప్ గా ఏర్పడి తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులకు కొమ్ము కాస్తూన్నారని ఐ. పి. ఎం. ఉద్యోగులు ఆరోపిస్తూన్నారు. డా. శివలీల ను బదిలీ చేసేవరకు ఐ. పి. ఎం. లో. అక్రమాలు ఆగే పరిస్థితులు కనిపించడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసారు.
- Advertisement -