Sunday, March 22, 2026

మూసి తీరంలో  అక్రమ సమోసాల దందా

- Advertisement -

మూసి తీరంలో  అక్రమ సమోసాల దందా
హైదరాబాద్, మార్చి 21

Illegal Samosa Racket on the Banks of the Musi
హైదరాబాద్‌వాసులు ఇష్టమైన చిరుతిండి సమోసా వెనుక దాగి ఉన్న భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది. పైన కరకరలాడుతూ, లోపల రచిగా అనిపించే సమోసాలు వాస్తవానికి కుళ్లిపోయిన పదార్థాలతో తయారవుతున్నాయే షాకింగ్ నిజాన్ని కుల్సుంపురా పోలీసులు బయటపెట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆపరిశుభ్ర వాతావరణంలో కల్తీ పదార్థాలతో సమోసాలు తయారు చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. కుల్సుంపురా ఇన్‌స్పెక్టర్ రాములు, ఎస్సై నర్సింహ తన టీంతో కలిసి జియాగూడ బైపాస్‌ రోడ్డులోని మూసీ తీరంలో ఉన్న ఒక షెడ్డుపై ఆకస్మిక దాడి చేశారు. గోల్కొండకు చెందిన అబ్దుల్ రషీద్  (73)అనే వ్యక్తి ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, ఫుడ్ సేఫ్టీ నిబంధనలను తుంగలో తొక్కి ఇక్కడ సమోసాలు తయారీ సాగుతోంది. కేవలం లాభార్జనే ధ్యేయంగా పెట్టుకున్న నిర్వాహకుడు ఐదారుగురు కార్మికులతో కలిసి ఈ అక్రమ కేంద్రాన్ని నడుపుతున్నాడు. పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసిన దృశ్యాలు అధికారులనే విస్మయానికి గురి చేశాయి. ఈ కేంద్రంలో వినియోగిస్తున్న పదార్థాలన్నీ అత్యంత నాసిరకమైనవి, అనారోగ్యకరమైనవి. సమోసాలు నింపే మిశ్రమం కోసం కుళ్లిపోయిన కోడిగుడ్లను వినియోగిస్తున్నారు. కాలం చెల్లిన, పదే పదే మరింగించిన కల్తీ వంట నూనెలను ఇక్కడ వాడుతున్నారు. సమోసా తయారీలో ఉపయోగించే ఆలుగడ్డలు, ఇతర కూరగాయలు కూడా కుళ్లిపోయినవేనని పోలీసులు ధ్రువీకరించారు. నిల్వ ఉండిపోయిన పురుగు పట్టిన మైదా పిండిని వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నారు. ఈ కేంద్రంలో తయారైన కల్తీ సమోసాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కావడం లేదు. జియాగూడ పరిసర ప్రాంతాల్లో అనేక హోటళ్లు, బేకరీలు, వీధి వ్యాపారులకు ఇక్కడి నుంచి పెద్ద మత్తంలో సరకు సరఫరా అవుతోంది. వినియోగదారులు ఆ రుచికి ఆకర్షితులవుతున్నప్పటికీ, లోపల జరుగుతున్న ఈ అక్రమ తంతూ ఎవరికీ తెలియదు. సాధారణంగా ఏదైనా ఆహార పదార్థాల తయారీ కేంద్రం నడపాలంటే ఫుడ్ సేఫ్టీ అండ్‌ స్టారండర్డ్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందాలి. కానీ అబ్దుల్ రషీద్ నడుపుతున్న ఈ షెడ్డుకు ఎటువంటి అనుమతులు లేవు. పూర్తి అపరిశుభ్రమైన వాతావరణంలో నేలపైనే పిండిని కలుపుతూ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో పోలీసులు పెద్ద మొత్తంలో మైదా, కల్తీ నూనెలు, కుళ్లిన గుడ్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు అబ్ధుల్ రషీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దందాలో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది, ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు అనే కోంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్