Sunday, September 8, 2024

అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి

- Advertisement -

అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి
ఓవర్ లోడ్, అతి వేగంగా వెళ్తే చర్యలు తీసుకోవాలి
ఇసుక పాలసీకి విధి విధానాలు రూపొందిస్తాం.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
జయశంకర్ భూపాలపల్లి,

Illegal transport of sand should be stopped

జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.శనీవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో అక్రమ ఇసుక రవాణా అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఇసుక పాలసీకి విధి విధానాలు రూపకల్పనపై పోలీస్, రెవెన్యూ, మైనింగ్, రవాణా, టిజిఎండిసి, జాతీయ రహదారులు, భూ గర్భ జలవనరుల శాఖ అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూజిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో జిల్లా వ్యాప్తంగా వాగుల నుండి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా, గోదావరి పరివాహక ప్రాంతాలలోని ఇసుక రీచ్ ల వద్ద లారీలు , ఇష్టారీతిన నడుపుతున్నారని, ప్రజలను ఇబ్బందులకు గురిచిస్తున్నారనిఅతివేగం, ఓవర్ లోడ్ తో , సరైన వే బిల్లులు లేకుండా లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  టి జి ఏం ఐ డి సి అధికారుల పర్యవేక్షణ కొరవడిందని  జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా, అనుమతులు ఉన్న కట్టడాలకు జి.ఓ నంబర్ 03 ప్రకారం పంచాయితీ సకార్యదర్శులు  అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.పోలీసు ,రెవెన్యూ , మైనింగ్ అధికారులు సంయుక్తంగా రాత్రి వేళల్లో పటిష్ఠ పహారా ఉండాలని అక్రమంగా ఇసుక  రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేయలన్నారు. ఉచిత ఇసుక పాలసీకి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు టీజీఎంఐడిసి అధికారుల అనుమతులు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు.జిల్లాలో పలుచోట్ల అక్రమంగా నిలువ చేసిన ఇసుక రీచ్ లను గుర్తించాలని, అక్రమంగా ఇసుక నిల్వ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తహసిల్దార్లను,  పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రధాన రహదారుల గుండా వేగంగా, ఓవర్ లోడ్ తో వే బిల్లులు లేకుండా నడుస్తున్న లారీలను గుర్తించడానికి  రవాణాశాఖ అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని  ఆదేశించారు. పరిమితికి మించి అధిక లోడ్ వల్ల రహదారులు దెబ్బతింటున్నాయని అలాంటి వాహనాలను గుర్తించి డ్రైవర్ పై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.  ఈ సమావేశంలో  ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,  ఆర్డీవో మంగీలాల్, మైనింగ్ అధికారి జయరాజ్,  జాతీయ రహదారుల ఈ ఈ మనోహర్ భూగర్భ జల శాఖ అధికారి, తహసిల్దారులు, సిఐలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్