Wednesday, March 18, 2026

నిమజ్జనం ప్రశాంతంగా జరుగాలి…

- Advertisement -

నిమజ్జనం ప్రశాంతంగా జరుగాలి…

Immersion should be done calmly...

ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి..

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి,

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం లోని రాజరాజేశ్వర వసతి గృహం లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కిరణ్ కరే తో కలసి రెవెన్యూ,  పోలీస్ పంచాయితీ, ఆర్డబ్ల్యూఎస్,  ఇరిగేషన్, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, విద్యుత్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, మత్స్య శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ  వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి, కమిటీ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16, 17 తేదీల్లో కాళేశ్వరం వద్ద గోదావరిలో వినాయక నిమజ్జనానికి భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాల నుండి విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ఠ మైన  ఏర్పాట్లు చేయాలని తెలిపారు.  నిమజ్జనానికి వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు యంత్రాంగం సూచనలు పాటించాలని తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలు పర్యవేక్షణకు అధికారులకు విధులు కేటాయించామని ఆయా శాఖల అధికారులు,  సిబ్బంది  షిప్టుల వారీగా 24 గంటలు విధులు నిర్వహించాలని తెలిపారు.  నిమజ్జనం చేయడానికి రెండు పాయింట్లు అలాగే  రెండు క్రేన్ లు ఏర్పాటు చేయడం జరిగిందని క్రేన్స్ ద్వారానే విగ్రహాలు నిమజ్జనం జరుగుతుందని  తెలిపారు.
నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులు జిల్లా యంత్రాగం నిర్దేశించిన ప్రదేశం వరకే అనుమతి ఉంటుందని భక్తులు సహకరించాలని సూచించారు. నిరంతర పారిశుద్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు.
పంచాయితీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా భక్తులకు త్రాగునీరు ఏర్పాట్లు చేయాలన్నారు.  అంతరాయం లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పించాలని, ఏదేని సమస్య వచ్చినా విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
మేఘా సంస్థ ద్వారా రెండు జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. గజ ఈత గాళ్ళు లైఫ్ జాకెట్లు ధరించి సిద్ధంగా ఉండాలని మత్స్యశాఖ అధికారిని ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడక్కడ రహదారులపై గుంతలు ఎర్పడ్డాయని మరమ్మతులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలని తెలిపారు.
మరుగుదొడ్లు గుర్తించే విధంగా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఏదేని సమస్య వస్తే అధికారులు తక్షణమే స్పందించి  పరిష్కరించాలని తెలిపారు. 9 రోజుల పాటు నైవేద్యాలు అందుకున్న వినాయకుడు గంగమ్మ వడికి చేరుతున్నాడని
ఎలాంటి అపశ్రుతులకు అవకాశం లేకుండా  భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా నిమజ్జనోత్సవం జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులు యంత్రాంగం సలహాలు, సూచనలు పాటించాలని పేర్కొన్నారు. ఏర్పాట్లు పర్యవేక్షణ  కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు.  రెండు రోజులు మద్యం విక్రయాలు నిలిపివేయాలని సూచించారు.
ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ
పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శోభాయాత్ర కొనసాగే మార్గాలలో పటిష్ఠ మైన  నిఘా ఉంటుందని  ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. భూపాలపల్లి, కాటారం, మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని, 24 గంటలు పనిచేయు విధంగా అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో  కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్