ఏడు రాష్ట్రాల్లో టీ సేఫ్ యాప్ అమలు
Implementation of Tea Safe app in seven states
మంత్రి సీతక్క
హైదరాబాద్
మహిళల్లో ఉన్న అభద్రత భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. శిక్ష, శిక్షణ ఏకకాలంలో అమలయితేనే క్రైమ్ రేట్ తగ్గుతుంది. మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. అమ్మాయిలను, మహిళలను గౌరవించేలా ప్రజల్లో అవగాహన పెంచుతాం. మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయి. వాటి కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. మత్తు బానిసలపై నిఘ పెంచుతాం. ఆస్పత్రుల్లో పని చేసే డాక్టర్లు కూడా అభద్రతాభావం లో ఉండటం బాధాకరం. మహిళా డాక్టర్లకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. మంత్రులు, ఉన్నతాధికారులతో త్వరలో కోర్ కమిటీ ఏర్పాటు చేస్తాం. అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్ సేఫ్టీ కమిటీలు వేస్తాం. మహిళా భద్రత కోసం ప్రతి శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.
అమ్మాయిలు మహిళల భద్రత మీ బాధ్యత అని అన్ని విద్యాసంస్థలకు తెలియ చెబుతాం. అమ్మాయిలను, మహిళలను గౌరవించేలా పాఠశాలల్లో పాఠాలు బోధిస్తాం. పబ్లిక్ ప్లేసుల్లో ఆసుపత్రిలో సీసీ కెమెరాలను పెంచేలా చర్యలు చేపడతామని అన్నారు. మహిళా భద్రత కోసం మా ప్రభుత్వం ప్రారంభించిన టి సేఫ్ యాప్ బాగా పనిచేస్తుంది. టి సేఫ్ యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. ఈ యాప్ ను ప్రారంభించేందుకు ఏడు రాష్ట్రాలు ముందుకొచ్చాయి. టి సేఫ్ యాప్ కు మరింత ప్రచారం కల్పిస్తాం. ఆటోలు, క్యాబ్ ల్లో టి సేఫ్ నెంబర్లను ప్రచారం చేస్తం. మహిళా భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను త్వరలో సీఎంకు సమర్పిస్తామని అన్నారు.