సంక్షేమ హాస్టళ్లలో వసతులను మెరుగుపరచండి
ఏ.ఐ.ఎస్.ఎఫ్
తిరుపతి
Improve facilities in welfare hostels
సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితి జైళ్ళ కన్నా అద్వానంగా ఉందని, సరైన వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు తిరుపతి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు సభ్యులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్ద చేరుకొని నినాదాలు చేస్తూ ముట్టడికి ప్రయత్నించగా పోలీస్ వారు అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని బకాయిలు ఉన్న మెస్, కాస్మటిక్ చార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మెస్ కాస్మోటిక్ చార్జీలను పెంచాలని కోరారు.సంక్షేమ వసతి గృహాలలో ఖాళీగా ఉన్న కుక్ , వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. వసతి గృహాలలో విద్యార్థులు కనీస సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. ఏం ప్రభుత్వం మారిన విద్యార్థుల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందనం ఉందని వాపోయారు. గురుకులాల్లో సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే మా డిమాండ్లను పరిష్కరించకపోతే ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు నవీన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్,జిల్లా ఆఫీస్ బ్యారెర్స్ సూర్య, ఓం రాజ్, హరికృష్ణ, వినయ్, చందు తదితరులు పాల్గొన్నారు