Monday, January 13, 2025

వైసీపీకీ ఇంతియాజ్ రాజీనామా

- Advertisement -

వైసీపీకీ ఇంతియాజ్ రాజీనామా

Imtiaz resigns from YCP

కర్నూలు, డిసెంబర్ 28, (వాయిస్ టుడే)
వైఎస్ఆర్సీపీకి మరో గట్టి షాక్ తగిలింది.  మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఈ రాజీనామా వైసీపీ  అధినేత జగన్ కు ఊహించని షాక్ లాంటిదే. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా కాదని అప్పటికప్పుడు ఆయనతో వీఆర్ఎస్ ఇప్పించి మరీ టిక్కెట్ ఇచ్చారు. కానీ ఆయన ఓడిపోయారు. ఇప్పుడు నేరుగా పార్టీకే గుడ్ బై చెప్పారు.ఇక నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన చెబుతున్నారు.ఇంతియాజ్ అహ్మద్ గత ఎన్నికల నామినేషన్ల రోజు వరకూ ఐఏఎస్ ఆఫీసర్‌గా ఉన్నారు.  వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంచి ప్రాధాన్యత లభించింది. కృష్ణా జిల్లాకు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.  ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. రిటైర్మెంట్ దగ్గర పడటంతో ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని ఆసక్తి వ్యక్తం చేయగానే ఆయనకు జగన్ టిక్కెట్ కేటాయించారు. టిక్కెట్ల కోసం భారీ పోటీ ఉన్నప్పటికీ కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. కర్నూలులో అప్పటికే వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గాలున్నాయి.  టికెట్‌ ఆశించిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు రాజ్యసభ సీటు ఇస్తానని, మాజీ ఎస్వీ మోహన్‌రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన సిద్దం సభలో హఫీజ్ ఖాన్‌ను  రెండేళ్లలో వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో రాజ్యసభకు పంపుతానని సీఎం జగన్‌ ప్రకటించారు. కానీ సమీప భవిష్యత్ లో మళ్లీ రాజ్యసభ స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.  ఎన్నికల సమయంలోనే ఈ రెండు వర్గాలు పని చేయలేదు. దాంతో  ఇంతియాజ్ అహ్మద్ ఘోరంగా ఓడిపోయారు. రాజకీయాలకు కొత్త అయిన ఇంతియాజ్ అహ్మద్ కు ప్రత్యేకమైన వర్గం అంటూ లేదు. దీంతో ఆయన కొన్ని రోజులుగా రాజకీయంగా ఏమీ చేయలేకపోతున్నారు. అటు ఎస్వీ మోహన్ రెడ్డి, ఇటు హఫీజ్ ఖాన్ తమ అనుచరులతో తామే వైసీపీ ఇంచార్జ్ అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు.  పార్టీ వైపు నుంచి ఎన్నికల తర్వాత ఆయనకు రాజకీయంగా సహకారం లభించకపోవడం, జగన్ కూడా పట్టించుకోకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక రాజకీయాల్లో ఉండనని ఆయన చెబుతున్నారు. సామాజిక సేవాకార్యక్రమాలుచేస్తానని అంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్