బీఆర్ఎస్ బైక్ ర్యాలీలో ఆపశృతి..!
డీజే బ్రేక్ ఫెయిల్ అయ్యి.. ఒక కార్యకర్త మృతి.. ఇద్దరు పరిస్థితి విషమం..!
పెను ప్రమాదం నుండి బయటపడ్డ రాగిడి, మల్లారెడ్డి పలువురు నాయకులకు..!
వాయిస్ టుడే న్యూస్, మే 03 మేడిపల్లి :
మేడ్చెల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ లో బీ ఆర్ ఎస్ పార్టీ బైక్ ర్యాలీలో ఆపశ్రుతి జరిగింది. బోడుప్పల్ దేవేందర్ నగర్ ఫేస్ 2 వద్ద ర్యాలీలో గడ్డ ఎక్కుతున్న సమయంలో డీజే బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఓక్కసారి గా వెనుకకు రావడంతో ఓ కార్యకర్త డీజె వాహనం కిందపడి చనిపోగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక హాస్పిటల్ కు తరలించారు, చిలకనగర్ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎస్. శ్రావణ్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు, గాయలయినా ఒకరిని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. కాగా డీజే వెనకనే ఉన్నా మరో వాహనంలో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యే మల్లా రెడ్డి, నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి, అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి లకు తృటిలో పెనుప్రమాదం తప్పింది, స్థానిక హాస్పిటల్ కు నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.



