- Advertisement -
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పై తప్పుడు కేసు పెట్టి ఇరికించారు
In the past, a false case was filed against Chief Minister Chandrababu Babu
కంప్లెంట్ ఇచ్చింది ఒకరు.. ఎఫ్ఐఆర్ లో ఇంకొకరి పేరు
సాక్షి పత్రికపై పరువు నష్టం కేసు వేసే అంశం సీఐడీ పరిశీలించాలి
మధుసూధన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి లపై కేసు పెట్టే అంశం పరిశీలన
– జీవీ రెడ్డి, ఛైర్మన్, ఎపి ఫైబర్ నెట్ లిమిటెడ్
విజయవాడ
గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అక్రమంగా కేసు పెట్టి ఇరికించారని అందుకే కోర్టు ఆ కేసును కొట్టివేసిందని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల ఫైబర్ నెట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ 2014 లో ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఉన్న సమయంలో టెరాసాఫ్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చారనే అభియోగాలపై గత ప్రభుత్వం కేసు పెట్టిందన్నారు. టెరా సాఫ్ట్ ఎండీ వేమూరి వేమూరి హరిప్రసాద్ పై తప్పుడు కేసులు పెట్టి వేధించారన్నారు.. కులాల ప్రాతిపదికన ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఇరికించేందుకు జగన్ మోహన్ రెడ్డి తప్పుడు ఫిర్యాదులు చేసి అక్రమంగా కేసు పెట్టించారన్నారు.. గతంలో మాజీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఫిర్యాదు చేస్తే ఎండీ ఫిర్యాదు ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్ కాలమ్ 6 లో రాశారన్నారు.. ఫిర్యాదులో ఎక్కడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు లేకపోయినా కక్షపూరితంగా వ్యవహరించారన్నారు. విచారణ మొదలు పెట్టాక చంద్రబాబు ను ఇరికించాలని ఆయన పేరు పెట్టారన్నారు.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పై పెట్టిన కేసులో విచారణ అధికారులు వేసిన చార్జి షాట్ ను కోర్టు రిజెక్ట్ చేసిందన్నారు.. చార్జిషీట్ ను కోర్టు రిజెక్టు చేస్తే జగన్ సొంత పత్రిక లో తప్పుడు వార్తలు రాశారన్నారు..
- Advertisement -