గతంలో యస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం పాటించింది చంద్రబాబే
In the past, Chandrababe practiced social justice by classifying YSS
ఇప్పుడు వర్గీకరణ చేసేది కూడా చంద్రబాబే
అందుకే మాదిగల కృతజ్ఞత యాత్ర
కర్నూలు
కృతజ్ఞత యాత్రలో భాగంగా ఈరోజు తేదీ 10/09/2024 కర్నూల్ టౌన్ చేరుకున్న యాత్ర సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరావు మాదిగ పత్రిక విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల మాదిగలను చంద్రబాబు చీలుస్తున్నారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులు విమర్శించిన సామాజిక న్యాయం పక్షాన నిలబడి ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు చేయబట్టే మాదిగ ఉపకులాలకు 25వేల ఉద్యోగాలు గతంలో వచ్చాయని ఇప్పుడు సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే అమలు చేస్తానని మాదిగలకు భరోసా ఇవ్వటమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మాదిగలకు రాజకీయ ప్రాథమిక కల్పించిన చంద్రబాబు యావత్ మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఆగస్టు 16న హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్ర చేపట్టడం జరిగిందని దీనిలో భాగంగా ఈరోజు కర్నూల్ అంబేద్కర్ భవన్ వద్దకు చేరుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై రాష్ట్రలకు అధికారాలు ఇస్తూ ఆగస్టు 1న సుప్రీం నాయ ధర్మసనం ఇచ్చిన తీర్పు భారతదేశ సామాజిక ఉద్యమాల చరిత్రలోనే గొప్ప తీర్పు అని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 59 కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలన్నా లక్ష్యంతో గత 30 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేశామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులు కోర్టులో ఎన్ని అడ్డంకులు సృష్టించిన చివరికి న్యాయమే గెలిచిందని వెంకటేశ్వరరావు మాదిగ తెలిపారు ఎస్సీల్లో ఆర్థికంగా ఎదిగిన సంపన్న కులాలు ఈ తిర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చిన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వాళ్లకు మద్దతు ప్రకటించలేదని వాస్తవాన్ని గ్రహించి సామాజిక న్యాయ వ్యతిరేక ఉద్యమాలు చేయడం సరైనది కాదని హితవు పలికారు బెజవాడలో బుడమేరు ముంపునకు గురైన వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను మంత్రులను కదిలించి గత పది రోజులుగా అక్కడే నీళ్లలో ఉండి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి కి విజయవాడ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఆయన కృషి అభినందనీయం అన్నారు హుదాద్ తుఫాన్లో విశాఖపట్నం ప్రజలకు తమ సహాయాన్ని గుర్తుపెట్టుకున్నారని అదే విధంగా విజయవాడ ప్రాంతానికి పూర్వయోగం తీసుకురావాలని వెంకటేశ్వరరావు మాదిగ ముఖ్యమంత్రిని కోరారు అనంతరం కర్నూల్ జిల్లా డిఆర్ఓ గారికి జిల్లా మాదిగల సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు