మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కన్వీనర్ రజనీకాంత్ సంఘాని కు ఘన స్వాగతం
“In the presence of the Munnur Kapu Sangam – a great tribute to Rajinikanth Sangani”

— రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం….
హైదరాబాద్: అక్టోబర్ 18(వాయిస్ టుడే)
గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో ఘనంగా, అట్టహాసంగా నిర్వహించిన జాతీయ మున్నూరు కాపు సమ్మేళనం నిర్వాహకులు మరియు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కన్వీనర్ రజనీకాంత్ సంఘాని ఇటీవల ఇండియాకు వచ్చిన సందర్భంగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోనీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీలోనీ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గం మరియు మున్నూరు కాపు నేతలు ఘన స్వాగతం పలికారు. రజనీకాంత్ సంఘానికి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుటం పురుషోత్తం రావు పటేల్ ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య పటేల్ శాలువాత వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ పటేల్ పూల బొకేతో ఘనంగా స్వాగతం పలికి ఆత్మీయ సమయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సత్కార కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో రజనీకాంత్ సంఘాని కన్వీనర్ గా గ్లోబల్ మున్నూరు కాపుల సమ్మేళనాన్ని విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. అమూల్యమైన సమయాన్ని ఇచ్చి రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన రజనీకాంత్ సంఘాని కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రజనీకాంత్ కు ఘన స్వాగతం పలికిన రాష్ట్ర కార్యవర్గానికి మరియు కుల ప్రముఖులకు సర్దార్ పుటం పురుషోత్తం రావు అభినందనలు తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగే వ్యక్తి రజనీకాంత్ అని ఈ సందర్భంగా పురుషోత్తమరావు పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు సంఘం తరపున అంతర్జాతీయ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరి శంకర్ పటేల్ దంపతులు, రమేష్ పటేల్ తదితరులను ఈ సందర్భంగా పురుషోత్తమరావు అభినందించారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసి లో అంతర్జాతీయ మున్నూరు కాపు సమ్మేళనానికి హాజరైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరి శంకర్ పటేల్ మాట్లాడుతూ రజనీకాంత్ కన్వీనర్ గా మున్నూరు కాపు సమ్మేళనం అట్టహాసంగా జరిగిందన్నారు. వేలాది మందికి సాంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు జరిగాయని, హైందవ సాంప్రదాయానికి నిలువుటద్దంగా సమ్మేళనం జరిగిందని కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథి, అంతర్జాతీయ మున్నూరు కాపు సమ్మేళనం రూప శిల్పి, జిఎంఏ కన్వీనర్ రజనీకాంత్ సంఘాని మాట్లాడుతూ గ్లోబల్ స్థాయిలో మున్నూరు కాపులను ఏకతాటి మీదికి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతోనే అమెరికాలోని వాషింగ్టన్ డిసి లో గ్లోబల్ మున్నూరు సమ్మేళనాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న కుల ప్రముఖుల ఆధ్వర్యంలో తాను కన్వీనర్ గా మున్నూరు కాపు సమ్మేళనాన్ని విజయవంతంగా పూర్తిచేయడం జరిగిందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మున్నూరు కాపులకు అన్ని రకాలుగా అండగా నిలబడాలన్న ఆకాంక్షతో తాము పని చేస్తున్నామని రజనీకాంత్ వివరించారు. 28 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లిన తాను, కుల ప్రముఖులు అందరం కలిసి భవిష్యత్తు తరం ఎలాంటి ఇబ్బందులు పడొద్దు అనే ఏకైక లక్ష్యం తో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందరిని వ్యక్తిగతంగా కలవలేకపోయినప్పటికీ, లక్షలాది మున్నూరు కాపుల అందరికీ సందేశం ఇవ్వగలిగామని రజనీకాంత్ సంతృప్తిని వ్యక్తం చేశారు. తదుపరి సమ్మేళనాన్ని దుబాయ్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ మేరకు అక్కడి కుల ప్రముఖులతో చర్చలు ప్రారంభించామని వివరించారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో తనకు ఇంత ఘనంగా, అద్భుతంగా స్వాగతం పలకటం పట్ల రజనీకాంత్ సంఘాని ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్న మీ వాడినే అని, మున్నూరు కాపుల సంక్షేమం, అభివృద్ధి గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఏకైక లక్ష్యమని సభికుల హర్షద్వానాల మధ్య రజనీకాంత్ సంగాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ది పెంటయ్య, ప్రధాన కార్యదర్శి చల్ల హరిశంకర్, కార్యనిర్వాహన అధ్యక్షులు మంగళరాపు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు (అధికార ప్రతినిధి) ఉప్పు రవీందర్, ఉపాధ్యక్షులు (అధికార ప్రతినిధి) వాసాలా వెంకటేష్, ఉపాధ్యక్షులు పర్వత సతీష్, ఉపాధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ కార్యదర్శి (అడ్మినస్ట్రెషన్)
ఆకుల సత్యనారాయణ, కార్యనిర్వాహన కార్యదర్శి యంజాల పద్మయ్య, కార్యనిర్వహణ కార్యదర్శి బొట్టు రాం, కార్యనిర్వహక కార్యదర్శి ఇందురి తిరుపతి, కార్యనిర్వహక కార్యదర్శి
పెఱిక రమేష్ కార్యనిర్వహక, అధ్యక్షులు హైదరాబాద్ జిల్లా
గుండ్ల పల్లి శేసగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు (న్యాయ విభాగం)
నలువాలా రవీందర్, కార్యదర్శి జిల్లా కార్యదర్శి కరీంనగర్
సాధనవేణి శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షులు, పంతులు మల్లయ్య,
ఆకుల శివ, దండు వినోద్, బత్తుల కిరణ్, సీనియర్ జర్నలిస్ట్ దాదె వెంకట్ ఇతర కుల ప్రముఖులు ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు.



