సాయి కృష్ణ కేసులో చంద్రబాబు ను ఏ1 గా హోంమంత్రి పై ఏ2 గా కేసు పెట్టాలి మాజీ మంత్రి గుడివాడ

- Advertisement -

సాయి కృష్ణ కేసులో చంద్రబాబు ను ఏ1 గా హోంమంత్రి పై ఏ2 గా కేసు పెట్టాలి
మాజీ మంత్రి గుడివాడ
విశాఖపట్నం

In the Sai Krishna case, a case should be filed naming Chandrababu as A1 and the Home Minister as A2.
— Former Minister Gudivada
సాయి కృష్ణ కేసులో చంద్రబాబు ను ఏ1 గా హోంమంత్రి పై ఏ2 గా కేసు పెట్టాలని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ డిమాండ్ చేసారు.
రాష్ట్రములో జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే భయం వేస్తోంది. నిన్నటి ఘటన చూసుకుంటే రాష్ట్రనికి భవిష్యత్ ఉండే అవకాశం లేదు. గాదె సాయి కృష్ణ అనే 23 ఏళ్ల యువకుడిని కృష్ణ లంక పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతని తల్లిని పలుమార్లు స్టేషన్ చుట్టూ తిప్పించారు. ఆ తల్లి నా బిడ్డ ఎక్కడ అనే అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదు. సాయి కృష్ణ తల్లి కోర్టులో పిర్యాదు చేసిన తర్వాత తెలిసింది యువకుడిని హత్య చేసి కాల్చి  బూడిద చేశారు అని.
79 ఏళ్ల చరిత్రలో ఇలాంటి ఘటన ఏ ప్రభుత్వంలో చూసి ఉండరు. ఇటువంటి చేతకాని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు అవకాసం ఇచ్చినందుకు సిగ్గుపడుతున్నాం. ముఖ్యమంత్రి కొడుకు అంబెడ్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. నిన్నటి వరకు కల్లబొల్లి మాటలు చెప్పిన ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి ఈరోజు హడావిడిగా కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిపై కోర్టు వారెంట్ ఉంటే మీరు ఎలా చిత్ర హింసలు పెడతారు.ఆ తల్లి శోకం చూస్తుంటే రాష్ట్ర ప్రజల హృదయాలు తరుక్కుపోతున్నాయని అన్నారు.
చేతకాని ప్రభుత్వం చేతకాని పోలీసులు వల్ల ముక్కున వెళ్లేసుకోవాల్సి వస్తుంది. ఎవరిపైన అయితే వారిపైనే గత రెండు సంవత్సరాలుగా కేసులు పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థ కాస్త సినిమా పోలీస్ వ్యవస్థ లా తయారైంది. డీజీపీ,హోంమంత్రి, లోకేష్ ,ముఖ్యమంత్రి పైన కేసులు పెట్టాలి. ఒక ఐజి స్థాయి అధికారిని తీసుకు వస్తే ఏమి వివారాలు వస్తాయి. గతంలో బీహార్ లో ఉన్న పరిస్థితులు  ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం. కేసులు ఉంటే చంపే అధికారం ఎవరీచ్చారు. 70 వేల సీసీ కెమెరాలో రాష్టంలో ఏర్పాటు చేశామని చెప్పారు. మే 9 నుండి ఇప్పటి వరకు జరిగిన దానిపై కృష్ణ లంకలో ఉన్న సీసీ ఫాయిటగెలను బయ్యటకు తీయండి. నాలుగేళ్ళ చిన్నారి తప్పి పోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి చేస్తుందో తెలీదు. పక్కా నియోజకవర్గ వర్గంలో జరిగితే హోంమంత్రి వెళ్లి పరామర్శించడానికి 12 రోజులు పట్టింది. లాకప్ డెత్ జరిగితే దానిని మేకప్ చేసే ప్రయత్నం జరిగింది. ఇంకా మీరు దేనిని మేకప్ చేసే పరిస్థితులు లేవు త్వరలోనే ప్రజలు మీకు ఫ్యాకప్ చేసే రోజులు వస్తాయని అన్నారు.
సాయి కృష్ణ విషయంలో ఒక సీఐని బలిపశువును చేశారు. దాని వెనుక ఉన్న ఇతర అధికారులు హోంమంత్రి పైన కేసు నమోదు చేయాలి. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ కి వెళితే ఎక్కడ సేవమై బయటకు వస్తామో అని భయం. సాయి కృష్ణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కాదు సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నాం. వంగా వీటి మోహన రంగ హత్యకు డిసెంబర్ 26 ముందు రోజు రాత్రి అప్పటి పోలీస్ అధికారి వ్యాస్ చెప్పిన మాటలు. అప్పటి హోంమంత్రి కోడెల శివప్రసాద్ ఎన్టీఆర్ పెద్దల్లుడు ముందురోజు సమావేశం అయ్యారు అని ఒక మాజీ పోలీస్ అధికారే చెప్పారు. మహనాయకుడైన వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేసిన టిడిపి పార్టీ సాయి కృష్ణను హత్య చేయదా . సాయి కృష్ణ కుటుంబానికి వైస్సార్సీపీ అండగా ఉంటుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular