Sunday, September 8, 2024

జాగృతిపైనే కవిత దృష్టా…

- Advertisement -

జాగృతిపైనే కవిత దృష్టా…
హైదరాబాద్, మార్చి 13,
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పార్లమెంటు ఎన్నికల బరిలో ఉండటం లేదని స్పష్టమయింది. నిజామాబాద్  నుంచి గతంలో గెలిచిన  కవిత.. ఓ సారి ఓడిపోయారు. ఈ సారి అక్కడే పోటీ చేసేందుకు గతంలో సన్నాహాలు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క సారిగా వెనుకడుగు వేశారు. పోటీ గురించి మాట్లాడటం లేదు. అంతే  కాదు నిజామాబాద్ బీఆర్ఎస్ వ్యవహారాలు కూడా చూసుకోవడంలేదు. పూర్తిగా తన తెలంగాణ జాగృతి సంస్థ  బలోపేతంపైనే దృష్టి పెట్టారు. తాను చేసే కార్యక్రమాలు పూర్తిగా జాగృతి పేరు మీదనే నిర్వహిస్తున్నారు.లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత నిర్వహించిన కీలక సమావేశాల్లో సైతం ఆమె కనిపించలేదు. కవిత పార్లమెంటు ఎన్నికల్లో నిలబడాలంటే ఆమె సొంత నియోజకవర్గంగా చెప్పుకునే నిజామాబాద్ నుండే బరిలో దిగుతారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఆమె ఉమ్మడి నిజామాబాద్ లోనే ఎక్కువగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ అక్కడ 9 అసెంబ్లీ సెగ్మెంట్లకు గానూ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. 2018 ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలవగా, యల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలిచింది. అనంతరం ఆ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా గులాబీ గూటికి చేరారు. కానీ ఈసారి కేవలం రెండు స్థానాలకే బీఆర్ఎస్ పరిమితం అయింది.  2018 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ 3 సీట్లు, కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకుంది. అంతేకాదు కామారెడ్డిలో సీఎం అభ్యర్థులు కేసీఆర్, రేవంత్ రెడ్డిలు సైతం బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.  నిజామాబాద్ కి పసుపు బోర్డు కేటాయించడంతో స్థానిక ఓటర్లలో బీజేపీపై విశ్వాసం పెరిగిందన్న అభిప్రాయం ఉంది.  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభావం పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి పాజిటివ్ అవ్వొచ్చు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండే ఛాన్స్ ఉంది. ఈ సమీకరణాలన్నీ అంచనా వేసుకున్న తర్వాత పోటీకి దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో కేసీఆర్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చారు. ఆ సమయంలో కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల్లో కవితే కీలకంగా  వ్యవహరించారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు ప్రచారం వచ్చేలా చేయడంలో కవితే కీలకంగా వ్యవహరించారు.  తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు స్వరాష్ట్రంలో ఓటమి చవిచూడటంతో కారు పార్టీ డీలా పడింది. జాతీయ రాజకీయాల సంగతి పక్కన పెట్టినట్టే కనిపిస్తోంది. తెలంగాణలో అనుకూల ఫలితం వచ్చి ఉంటే  కవిత ఎంపీగా పోటీ చేసేవారు  .  కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లో బిజీగా ఉండేవారు.. కవిత కూడా రాష్ట్ర రాజకీయాల్లో కనిపించేవారు. దీంతో నాలుగు ఉద్యోగాల తాలూకా మారక ఎక్కువగా కనిపించేది కాదు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు మెదక్ నుంచి  పోటీ చేయించడానికి కూడా కేసీఆర్ సిద్ధంగా లేరని అంటున్నారు. ఓటమి భయంతో కేసీఆర్ కూతుర్ని నిజామాబాద్ లో పోటీ చేయించడం లేదని, దమ్ముంటే పోటీ చేయించాలని  రేవంత్ రెడ్డి భద్రాచలంలో సవాల్ విసిరారు.   బీఆర్ఎస్ – బీజేపీ మధ్య లోపాయికారిక ఒప్పందం ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో కవితని అరెస్ట్ చేయకపోవడానికి కూడా కారణం అదేనంటూ బలంగా వాదిస్తున్నాయి. ఇక అందులో భాగంగానే నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కి మేలు చేకూర్చడానికి కవితని పోటీలో ఉంచడం లేదని అంటున్నారు. ఓ డమ్మీ క్యాండిడేట్ ని నిలబెట్టి, బీజేపీకి రహస్య మద్దతు ఇస్తారనే టాక్ నడుస్తోంది.  దీన్ని రేవంత్ రెడ్డి హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.మరో వపు కవిత బీఆర్ఎస్ తరపున  కాకుండా.. తెలంగాణ జాగృతి తరపన  రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు.  మహిళల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న జిఓ 3ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కవిత ఇతర భారత్ జాగృతి కార్యకర్తలతో కలిసి ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. తాజాగా అసెంబ్లీలో పూలే విగ్రహాం కోసం బీసీ సంఘాలతో కూడా జాగృతి తరపునే సమావేశం నిర్వహించారు. పైగా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీ తరపున నిజామాబాద్ లో  ఇప్పుడు ప్రచారం చేయడం లేదు. లోక్ సభ ఎన్నికలు వస్తున్నందున అక్కడ నిలబడబోయే అభ్యర్తి కోసం కూడా కసరత్తు చేయడం లేదు. దీంతో రాజకీయం విషయంలో కవిత తన సొంత బాటను ఎంచుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. దీనికి కారణం రాజకీయ వ్యూహమా కాదా అన్నది  ముందు ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్