- Advertisement -
సెలవుల్లో పోలీసుల పెట్రోలింగ్ పెంపు
Increased police patrolling during holidays
కాకినాడ
దసరా పండగ ఉత్సవాలను పురస్కరించుకొని కాకినాడ జిల్లాలో నేరాల నియంత్రణ కోసం జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు రాత్రి సమయంలో గస్తీ, పెట్రోలింగ్, బీట్లను పెంచడం జరిగిందని కాకినాడ డిఎస్పి రఘువీర్ విష్ణు తెలిపారు. కాకినాడ పట్టణం లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ రాత్రి సమయంలో గస్తీ పెట్రోలింగ్ చేయడానికి ఒక పెట్రోలింగ్ వాహనాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. దసరా సెలవులో వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు,వారి వివరాలు, ఇంటి చిరునామా,దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తెలిపితే పోలీసులు వారి ఇంటికి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. .ఈ కార్యక్రమంలో కాకినాడ నగర సిఐలు. నాగ దుర్గారావు,అప్పలనాయుడు, సత్యనారాయణ,సునీల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -