Thursday, March 5, 2026

అత్య‌ధిక సంఖ్య‌లో ఇండియాలోనే క్ష‌య వ్యాధి కేసులు

- Advertisement -

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డి

న్యూఢిల్లీ నవంబర్ 9: అత్య‌ధిక సంఖ్య‌లో క్ష‌య కేసులు ఇండియాలోనే న‌మోదు అయిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. 2022లో భార‌త దేశంలోనే ఆ కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఓ రిపోర్టులో తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కేసుల్లో ఇండియాలోనే 27 శాతం టీబీ కేసులు ఉన్న‌ట్లు గుర్తించారు. మొత్తం 28.2 ల‌క్ష‌ల కేసులు ఉన్నాయ‌ని, దాంట్లో 12 శాతం అంటే 3.42 ల‌క్ష‌ల మంది ఆ వ్యాధికి బ‌లైన‌ట్లు రిపోర్టులో తెలిపారు.

India has the highest number of TB cases
India has the highest number of TB cases

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్ర‌కారం.. 30 దేశాల్లో 87 శాతం టీబీ కేసులు ఉన్న‌ట్లు తేలింది.భార‌త్ త‌ర్వాత అత్య‌ధిక టీబీ కేసులు ఉన్న దేశాల్లో ఇండోనేషియా(10 శాతం), చైనా(7.1 శాతం), పిలిప్పీన్స్‌(7 శాతం), పాకిస్థాన్(5.7 శాతం), నైజీరియా(4.5 శాతం), బంగ్లాదేశ్‌(3.6 శాతం), కాంగో(3 శాతం) ఉన్నాయి. అయితే భార‌త్‌లో క్ష‌య‌వ్యాధి కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌చ్చిన‌ట్లు రిపోర్టులో పేర్కొన్నారు. 2015లో ప్ర‌తి ల‌క్ష మందిలో 258 మంది క్ష‌య వ్యాధిగ్ర‌స్తులు ఉండేవారు, అయితే 2022 నాటి ఆ సంఖ్య 199కి ప‌డిపోయిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌న రిపోర్టులో తెలిపింది. కానీ ప్ర‌పంచ స‌గ‌టుతో పోలిస్తే చాలా ఎక్కువే ఉన్న‌ట్లు తెలిసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్