Thursday, February 19, 2026

కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోంది : ప్రధాని నరేంద్ర మోడీ

- Advertisement -

కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోంది : ప్రధాని నరేంద్ర మోడీ
న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 19

India is delivering new technology: Prime Minister Narendra Modi
కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సాంకేతికత కేంద్రంగా ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తోందని అన్నారు. ఢిల్లీలో ఎఐ ఇంపాక్ట్ సమిట్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మోడీ, కేంద్రమంత్రి అశ్వనీ వైభవ్ పాల్గొన్నారు. ఢిల్లీలో మోడీ ప్రసంగించారు. భారత్ ఆరో వంతు ప్రపంచ జనాభా కలిగి ఉందని, యువత.. భారత్ కు కొత్త విశ్వాసం, ఆసక్తిగా ఉందని తెలియజేశారు. వేగంగా, విశ్వాసంతో సాంకేతికతను స్వీకరిస్తున్నామని, యువత ఎఐ అమలులో ఆసక్తి కనబరుస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వివిధ రంగాల సమస్యలకు ఎఐ పరిష్కారం చూపుతోందని, మేకిన్ ఇండియా, భారత ఆవిష్కరణల సామర్థ్యం ఎఐ సదస్సు చాటుతోందని మోడీ పేర్కొన్నారు. ఎఐ సామర్థ్యం ఆలోచనలకు అందనంత దూరంగా ఉందని, మానవ కేంద్రీకృత ఎఐ నిర్మాణ మన లక్ష్యం కావాలని అన్నారు. భారత్ ఎఐ పురోభివృద్ధి ఒక చరిత్రగా నిలుస్తుందని, మానవ అభివృద్ధిలో ఎఐ కీలక భూమిక పోషిస్తుందని కొనియాడారు. మానవులు, సాంకేతికత కలిసి అభివృద్ధి పయనం సాగించే శకంలో ఉన్నాయని, ఎఐ మన పనితీరును మరింత పరిపుష్టం చేస్తుందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్