భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్ర బాబు ఒక విజన్ డాక్యుమెంటును విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు విశాఖ నగరంలోని ఎం జీఎం పార్కు గ్రౌండ్ లో ప్రజల సమక్షంలో ఆవిష్కరించి అందు లోని ముఖ్యాంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. 2047వ సంవత్సరం నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అవుతుంది. ఏ వ్యూహాలు అనుసరిస్తే అప్పటికి దేశం ప్రపంచంలో అగ్రగామి గా నిలుస్తుందో వివరిస్తూ మొత్తం 52 పేజీలతో ఈ డాక్యుమెంటును రూ పొందించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తొలిసారి విజన్-2020 తయారు చేయించి విడుదల చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర కోసం విజన్-2029 తయారు చేయిం చారు. ఆ అనుభవంతో ఇప్పుడు దేశం కోసం భారత్-భారతీయులు- తెలుగు వారు-విజన్-2047ని రూపొందింపజే శారు. ఐదు ప్రధాన వ్యూహాలతో ముం దుకెళ్తే మన దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుం దని చంద్రబాబు ఇందులో తెలిపారు.ప్రపంచానికి నాయకత్వం వహించే శక్తిని సంపాదిం చుకోవడానికి నిర్దిష్టంగా కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పనిచేయాలని, అప్పుడే మన దేశం 2047 నాటికి ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుం దని ఈ విజన్ డాక్యుమెంటు ముందు మాటలో పేర్కొన్నారు.