Sunday, September 8, 2024

మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం..

- Advertisement -

మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం..

Indira Mahila Shakti program to train women as entrepreneurs.:

జిల్లా కలెక్టర్ పమేల సత్పతి

కరీంనగర్

ప్రారంభించే వ్యాపారంపై సమగ్ర అవగాహనను కలిగి ఉండాలి
వ్యాపారం ఎక్కువకాలం కొనసాగేలా సమిష్టిగా సహాకారంతో సాగాలి
స్కూల్ యూనిఫాం  స్టిచ్చింగ్ లో జిల్లాలో మహిళా  సంఘాలు సక్సెస్ సాధించాయి.
మహిళాశక్తి కార్యక్రమంలో కొరకు వివిధ పథకాలను గురించి అధికారుల అవగాహన
గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి ఇందిరా మహిళా శక్తి ఉపయోగపడుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
గురువారం కలెక్టరేట్ ఆడిటోరియం లో ఇందిరా మహిళా శక్తి పై  డి ఆర్ డి ఏ, మెప్మా, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఇండస్ట్రీ అధికారులతో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్ధేశించి ఆమె మాట్లాడుతూ, మహిళలను అద్భుత పారిశ్రామిక వేత్తలుగా తీర్చిద్దాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి రూపకల్పన చేసిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు వ్యాపారాన్ని ప్రారంభించే ముందు.  మీ ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువుకు సంబంధించిన మార్కెటింగ్ మరియు వ్యాపారం గురించిన సంపూర్ణ అవగాహనను పెంపొందించుకొవాలని అన్నారు.  కరీంనగర్ జిల్లాలో మొట్ట మొదటగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కొరకు మెప్మా , డిఆర్డిఓ, మహిళల సంఘాలు స్ట్రిచ్చింగ్ చేసి అందించడంతో కార్యక్రమం విజయవంతం అయిందని పేర్కోన్నారు.  అదే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా సివిల్ పనులను మహిళా సంఘాల ద్వారా చేపట్టగా 85శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.  మిగిలిన 15శాతం పనులు త్వరగా పూర్తిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.   ప్రతి మహిళా ఎదోఒక మైక్రో ఎంటర్ ప్రైజెస్ ను సద్వినియోగం చేసుకుంటున్నారని, 7800 మైక్రో ఎంటర్ ప్రైజెస్ యూనిట్ ల ద్వారా సహాకారం అందిస్తూ.  పియంఈజివైయం ద్వారా సబ్సిడి కూడా ఇప్పించడం జరుగుతుందని పేర్కోన్నారు.  మహిళా సంఘాలన్ని ఒకే చోట ఒకే విధమైన వ్యాపారాలను నిర్వహించడం వంటివి కాకుండా అక్కడి మార్కెట్ పరీస్థితులకు అనుగునంగా వ్యాపారాలను ప్రారంభించుకోవాలని అన్నారు.  వ్యాపారాన్ని సమిష్టిగా నిర్వహించడం మాత్రమే కాదు, వ్యాపార వృద్ధి కూడా సంపూర్ణ సహాయ సహకారాలతో ఎలాంటి అపోహాలకు తావు లేకుండా జరగాలని అప్పుడే అద్భుతమైన విజయాలను చవిచూడగలమన్నారు.

కొన్ని చోట్ల స్వయం సహాయ సంఘాల ద్వారా జరిగే వ్యాపారాలు అనుకున్న విజయాలను సాధించినప్పటికి కొంత కాలం నడిపించామా, ఆ తరువాత వ్యాపారం పూర్తిగా మూసివేశామ అన్న చందంగా ఉండకుండదని, పటిష్టమైన క్యాలిటిని డిమాండుకు తగ్గ సప్లైని అందిస్తూ వినియోగదారుల ప్రాధాన్యతను చూరగొని వ్యాపారాలను వృద్ది చేసుకొవాలని తెలిపారు. అదే విధంగా వ్యాపారం కొరకు తీసుకునే ఋణాలను కూడా సకాలంలో చెల్లించాలని  అన్నారు. మహిళా సంఘాలకు ఏమేమి పథకాలు ఉన్నాయో వివరించారు. మహిళా సంఘాలు వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. డిమాండ్ ప్రాతిపదికన  యూనిట్లు ఏర్పాటు చేస్తే అవి ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.
అదనపు కలెక్టర్ lప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, కోటి మంది మహిళలను కొటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ముందుగా వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంబించాలనుకున్న, దానికన్న ముందే మన సామర్థ్యం, వీక్ నెస్, సహాకారం, నిజాయితి ఈ విషయాలను గురించి సంపూర్ణ, స్పష్టమైన అవగాహనను కలిగి ఉన్నట్లయితే వ్యాపారాన్ని సునాయాసంగా లాభసాటిగా మార్చుకొగలమని తెలిపారు.  అదే విధంగా వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగించే వారిని ఆదర్శంగా తీసుకొని మహిళా సంఘాలన్ని సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఓ శ్రీనివాస్, ఎల్డియం ఆంజనేయులు, జియం ఇండస్ట్రీస్ నవీన్ కుమార్, పశు సంవర్దక శాఖ అధికారి తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్