- Advertisement -
రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి- వై విక్రమ్
Indiramma houses should be granted beyond politics- Y Vikram
ఖమ్మం
అసెంబ్లీ పరిధిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందే విధంగా అధికారులు, మంత్రి చర్యలు తీసుకోవాలి అని సి పి ఎం పార్టీ ఖమ్మం డివిజన్ సెక్రటరీ వై విక్రమ్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం అర్బన్ సి పి ఎం పార్టీ మండల కమిటీ సమావేశం సుందరయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీ ఆర్ స్ పరిపాలన కాలంలో నిజాయితీగా ఇండ్లు స్థలాలు లేని వారికి న్యాయం జరగలేదు అని, ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా అర్హులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారికి న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు పేరుతో 10 సంవత్సరాలు కాలయాపన చేశారని, ఖమ్మం అసెంబ్లీ పరిధిలో 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి చివరికి 3 వేల ఇళ్లు ఇవ్వలేదు అని ఆరోపించారు. ఇప్పుడు ఖమ్మం పరిదిలో 20 వేల మంది ఇండ్లు స్థలాలు లేని వారు వున్నారు అని, సర్వే చేస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది అని తెలిపారు. రఘునాథ్ పాలెం లో ఇండ్లు స్థలాలు ఇస్తామని చెప్పి చివరికి ఆ స్థలాలు కోర్టు పరిధిలో వున్నాయి అని చెప్పి అధికారులు చేతులు దులుపుకున్నారు అని విమర్శించారు. ఇప్పుడు వెంటనే ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇందిరమ్మ ఐదు లక్షల పథకం పకడ్బందీగా సర్వే నిర్వహించి అర్హులకు న్యాయం చేయాలని, రాజకీయాలకు అతీతంగా పేదలకు ఈ పథకం వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమాజంలో జిల్లా నాయకులు SK మీరా సాహిబ్, మండల కార్యదర్శి బి ఉపేంద్ర, నాయకులు గోవిందా, నాగేశ్వరరావు, మధు, శ్రీనివాసురావు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -