పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

- Advertisement -

పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాడవేనీ సునీల్

కోరుట్ల,
ప్రస్తుతం జరుగుతున్న పదోతరగతి పరీక్షలు నైపథ్యంలో
పదో తరగతి పరీక్షల కేంద్రాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాడవేనీ సునీల్ ఆన్నారు.. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పరీక్షలు రాసే విద్యార్థులు
పరీక్ష కేంద్రాలలో త్రాగు నీరు సదుపాయం కల్పించాలని, రూంలలో పరిశుభ్రత పాటించాలని కోరారు. అలాగే విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు పరీక్ష సమయాలు దృష్టిలో పెట్టుకొని ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా తాము చదివిన జవాబు పత్రాలలో వ్రాయలని ఆయన సూచించారు, అదేవిధంగా పరీక్షలు భయంతో కాకుండా బాధ్యత తో వ్రాయాలని  అన్నారు.. విద్యార్థులకి  త్రాగు నీరు, ఏర్పాటు చేయాలనీ పాఠశాల యాజమాన్యంలను కోరారు.. 10వ తరగతి విద్యార్థులకు
ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular