సిద్ధిరామప్ప వాణిజ్య సముదాయం క్యూకాంప్లెక్స్ పరిశీలన
శ్రీశైలం: కార్తీకమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం వివిధ ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇందులో భాగంగా ఈ రోజు దర్శకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి శక్రపాణిరెడ్డి కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు సంబంధిత అధికారులతో కలిసి క్యూ కాంప్లెక్స్ ను క్యూలైన్లను మరియు సిద్ధిరామప్ప వాణిజ్య సముదాయాన్ని పరిశీలించారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కార్యనిర్వహణాధికారి వారు ఆదేశించారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. కాంప్లెక్స్ అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచాలన్నారు. అనంతరం సిద్దిరామప్ప కాంప్లెక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ సిద్ధరామప్ప కాంప్లెక్స్ నందు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వాణిజ్యనముదాయము నందు చెత్తచెదారాలు వేయకుండా చూడాలన్నారు. అలాగే శ్రీశైలక్షేత్రాన్ని స్వచ్ఛ శ్రీశైలంగా ఉంచేందుకు స్థానికులు దుకాణదారులు, యాత్రికులతో సహకరించాలన్నారు. ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు చంద్రశేఖరశాస్త్రి సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.