Friday, January 17, 2025

నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకే సి.సి.కెమెరాల ఏర్పాటు

- Advertisement -

నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకే సి.సి.కెమెరాల ఏర్పాటు

Installation of CC cameras for crime control and public safety

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
విజయనగరం
విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలో 38 సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణకు పోలీసు స్టేషనులో కమాండ్ కంట్రోలు కు పోలీసులు అనుసంధానం చేసారు. మరో 60 సిసికెమెరాల ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టారు.  సి.సి.కెమెరాలను ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన దాతలను జిల్లాఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, జ్ఞాపికలను అందజేసారుఉ.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – నేరాలను నియంత్రించుటలకు ప్రతీ ప్రాంతంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 620 సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసిందన్నారు. కానీ, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రజల సహకారంతో మరికొన్ని సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు.
2వ పట్టణ సిఐ
మరియు సిబ్బంది ఎంతో స్ఫూర్తితో స్థానిక ప్రజల సహకారంతో 38 సి.సి.కెమెరాలను 2వ పట్టణ పోలీసు స్టేషను పరిదిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, వాటిని పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.ఒక సి.సి. కెమెరా 20మంది పోలీసులు చేసే పనిని చేస్తుందన్నారు. నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలపై నిరంతరం నిఘా పెట్టేందుకు, నేరాలను నియంత్రించుటలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ఈవ్ టీజింగు, గంజాయి అక్రమ రవాణ, దొంగతనాలు వంటి నేరాల కట్టడిలో సి.సి. కెమెరాలు, సాంకేతికతను వినియోగించుకొంటే మంచి ఫలితాలను సాధించవచ్చునన్నారు. సాధారణంగా జిల్లా లేదా సబ్ డివిజన్ స్థాయిలో కమాండ్ కంట్రోల్
ఉంటుందని, కానీ, ప్రప్రధమంగా ఒక పోలీసు స్టేషను పరిధిలో నిఘా ఏర్పాటు చేసేందుకు కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి, ఇతర జిల్లాలకు సిఐ శ్రీనివాసరావు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలిచారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రశంసించారు. గత ఆరు మాసాలుగా జిల్లా పోలీసు యంత్రాంగం చక్కగా పని చేయడం వలన జిల్లాలో నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయని,భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పోలీసు అధికారులు, సిబ్బంది పని చేయాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్