లక్ట్రోరల్ నమోదు, తొలగింపుల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా ఈఆర్ఓలు బాధ్యతగా వ్యవహరించాలి
ఎన్నికల సంఘం సూచనలు తప్పనిసరిగా పాటించాలి
ఎలక్ట్రోరల్ నమోదు, తొలగింపులు పై ఎలాంటి తప్పిదం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఈఆర్వోలు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని, ఎన్నికల సంఘం ఆదేశాలు, నిబంధనలను అనుసరించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సాధారణ ఎన్నికల సన్నద్ధత, పలు అంశాలపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ, జెసి శుభం బన్సల్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితర సంబంధిత ఈఆర్వో లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ సూచనలు, ఎన్నికల విధులపై ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ఎన్నికల సన్నద్ధతపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈఆర్ఓ లు, ఎఈఆర్ఓ లు, నోడల్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిఈఓ కు వివరిస్తూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నామని పలు వివరాలు తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు ఈఆర్ఓ లతో జిల్లా కలెక్టర్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క సారి ఎన్నికలు కొత్తగా అప్రమత్తంగా బాధ్యతగా నిర్వహించాలని, ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలను అనుసరించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ నుండి సూచించిన హ్యాండ్ బుక్ లోని నిబంధనలు, మార్గదర్శకాలను తప్పక అనుసరించాలని సూచించారు. ఫారం 6 ప్రకారం ఓటర్ల జాబితాలో చేర్పులు ఉంటే 0.1 శాతం వరకు ఆర్ఓ పరిధిలో ఉంటుందని ఆపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేయాలని అన్నారు. అదేవిధంగా తీసివేతలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేయాలని అన్నారు. త్వరితగతిన ఓటర్ పెండింగ్ అభ్యంతరాలను, పొరపాట్లను సవరించాలని సూచించారు. స్వీప్ కార్యక్రమాలు వేగవంతం చేసి ఓటరు నమోదు లో గ్యాప్ లేకుండా అర్హత గల ఓటరు నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు ఉండేలా చూడాలని ర్యాంపు ఏర్పాటు, తగినంత మరుగుదొడ్లు నీటి వసతి తో ఉండాలి, త్రాగు నీటి ఏర్పాటు, ఎలక్ట్రిసిటీ సంబంధిత కనెక్టివిటీ సక్రమంగా ఉండాలని, ఫ్యాన్, రెండు డోర్ లు ఉండేలా, వెలుతురు ఉండేలా, ఫర్నీచర్ తగినంత ఉండేలా వెరిఫై చేసుకోవాలని, ఓటర్ ఫెసిలిటేశన్ సక్రమంగా ఉండాలి అని సూచించారు. సమస్యాత్మక, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన వాటిలో వెబ్ కాస్టింగ్, అవసరమైన చోట వీడియోగ్రఫీ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చెక్ పోస్టులు ఏర్పాటు, స్టాటిక్ సర్వైవలేన్స్ టీమ్, వీడియో సర్వైవలేన్స్ టీమ్, వీడియో వ్యూయింగ్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, ఎంసిసి టీమ్, మైక్రో అబ్జర్వర్ తదితర టీమ్ లు ఏర్పాటు కొరకు ప్రణాళికలు సిద్ధం కావాలని సూచించారు. నియోజక వర్గాలలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లు, రిసెప్షన్ సెంటర్లు, ఈవిఎం లు భద్రపరిచే ఇంటీరియమ్ కేంద్రాలు మరియు కౌంటింగ్ కేంద్రాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధారణ ఎన్నికల -2024 సన్నద్ధతపై
నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను సక్రమంగా బాధ్యతగా నిర్వర్తించాలని అన్నారు.
ఈ సమీక్షలో ఈఆర్ఓ లు కోదండ రామిరెడ్డి, నిషాంత్ రెడ్డి, చంద్రముని, రవిశంకర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు చంద్ర శేఖర్ నాయుడు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు, ఎలక్షన్ తహశీల్దార్ చంద్ర శేఖర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.