Monday, January 13, 2025

కోటి మంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్

- Advertisement -

కోటి మంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్

Insurance for 1 crore of workers

గుంటూరు, జనవరి 4, (వాయిస్ టుడే)
తెలుగుదేశం పార్టీకి కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. సభ్యత్వ నమోదులో ఆ పార్టీ చరిత్ర సృష్టించింది. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశానికి ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని  కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక వారికి విద్య, ఉద్యోగ, వైద్య సహాయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని టీడీపీ తెలిపింది. 2024 ఏడాది అక్టోబర్ 26న ప్రారంభమైన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిసెంబర్ 31తో ముగియాల్సి ఉన్నప్పటికీ ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో మరో 15 రోజులు పొడిగించినట్లుగా టీడీపీ ప్రకటించారు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో దాదాపు కోటి మంది వరకు సభ్యత్వం తీసుకున్నారు. కార్యకర్తలు ఏదైనా ప్రమాదంలో మరణించినప్పుడు ఆదుకోవడానికి సభ్యత్వ నమోదు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మేరకు కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు.  టీడీపీ కార్యకర్తలు ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే పార్టీ ఆఫీసును సంప్రదించడం లేట్ కావడంతో పాటు పలు పత్రాలను సేకరించడంలో ఇబ్బంది పడుతూంటారు. అందుకే అవగాహన కోసం ముందుగానే టీడీపీ కీలక విషయాలను వెల్లడించారు. కార్యకర్తలు ప్రమాద బీమా పొందేందుకు అవసరమైన పత్రాలు, మార్గదర్శకాలను వెల్లడించింది. ప్రమాద బీమా పొందేందుకు బాధిత కుటుంబం ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఎస్.ఐ సంతకం, స్టాంప్ తో కూడిన ఫిర్యాదు లేఖ, శవ పంచనామా, పోస్ట్ మార్టమ్ నివేదిక, మండల రెవెన్యు అధికారి జారీ చేసిన అసలు మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం(ఫ్యామిలీ సర్టిఫికెట్) సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, 4 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు అందించాల్సి ఉంటుంది. ప్రమాద వార్తను కవర్ చేసిన న్యూస్ పేపర్ కటింగ్ లు, ప్రమాదం జరిగినప్పుడు తీసిన 2 ఫోటోలను జత చేయాలి. వీటితో పాటు నామినీ ఆధార్, ఓటర్ కార్డ్, 4 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, పాన్ కార్డు అందించాలి. ఆయా పత్రాలన్నీ ఒక సెట్ ఒరిజినల్, 2 సెట్లు జిరాక్స్ కాపీలు జతపరచాలి. ఏదైనా ప్రమాదంలో వ్యక్తి మరణించినప్పుడు 15 రోజుల్లో తెలియపరచాలని, ప్రమాదం జరిగిన 30 రోజుల్లోగా నామినీ స్వయంగా డాక్యుమెంట్లు తీసుకుని గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని వెల్లడించింది. ఏదైనా సమాచారం కోసం 7306299999 నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్