ఉమ్మడి మండలాల్లో ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మించాలి
Integrated schools should be built in common mandals
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డి. వై. గిరి
మహబూబాబాద్
తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా మంజూరు అయిన యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణం నర్సింహుల పేట, డోర్నకల్ ఉమ్మడి మండల కేంద్రాల్లో ఏదో ఒక చోట జరపాలని జిల్లా అధికారులను ప్రజా ప్రతినిధులను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డి. వై. గిరి కోరారు. యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణం కోసం రెండవ దశలో రాష్ట్ర వ్యాపితంగా 26 స్కూల్స్ మంజూరు కాగా, అందులో ఒక్కటి డోర్నకల్ నియోజకవర్గం కోసం మంజూరు కావడం హర్షనీయం. జిల్లాలో ముఖ్యంగా గిరిజన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నత్తికి కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్శిశిస్తున్నారని ఈ సందర్బంగా డి. వై. గిరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటికే కురవిలో రెండు ఏకలవ్య గురుకులాలు, మరిపెడలో రెండు గురుకులాలు ఉన్నాయని, డోర్నకల్, నర్సింహాలపేట ఉమ్మడి మండలాల్లో అన్ని మండలాల లాగే మోడల్ స్కూల్స్ ఉన్నాయని, ఇంత వరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ గురుకులాలు లేని మండలాలు అయిన ఈ మండలాలకు ప్రస్తుతం మంజూరు అయిన యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్ / కాలేజీ నిర్మాణం చేయాలని జిల్లా అదికారులను, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రామ చంద్రు నాయక్ ను కోరారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా డోర్నకల్, నర్సింహాల పేట అంటేనే విద్య, వైద్య సౌకర్యం పట్ల వివక్షత ఉందని, అటువంటి చర్యలు మల్లి పునరావృతం కాకుండా ప్రస్తుత ప్రజా ప్రతినిధులు అభివృద్ధిలో సమాతూకం పాటించాలని ఆయన అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జరిగే విదంగా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు చూసే బాధ్యత గుర్తురిగి పని చేయాలని డి. వై. గిరి చెప్పారు. తక్షణమే డోర్నకల్, నర్సింహాల పేట మండలాల ప్రజల విద్య వెనుక బాటు తనం గుర్తించి ఆయా మండలాల్లో ఎక్కడో ఒక దగ్గర ప్రస్తుతం మంజూరు అయిన యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్/ కాలేజిని తక్షణమే నిర్మించే విదంగా ఇక్కడి స్థానికులు నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, అధికారులపై ఒత్తిడి తేవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.