20 తర్వాత ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్, ఏప్రిల్ 10,
తెలంగాణ ఇంటర్ ఫలితాలపై అప్డే్ట్ వచ్చింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ఏప్రిల్ 20లోగావిడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం(Spot Valuation) పూర్తైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించారు. ఫలితాల కోసం 9 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పరీక్ష ఫలితాల సాంకేతిక అంశాలపై అధికారులు దృష్టిపెట్టారు. దీనికి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పరీక్ష రాసిన విద్యార్థులు, రాయనివాళ్లు, మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన వాళ్ల సమాచారం నమోదు చేస్తారు. దీంతో పాటు వాల్యూయేషన్‌లో వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది.మార్కులు ఆన్ లైన్ లో నమోదు అనంతరం…ఓఎంఆర్ షీటు కోడ్ డీకోడ్ చేసి ఫలితాలు సక్రమంగా ఉన్నాయో లేదో అధికారులు ఒకటి రెండు సార్లు చెక్ చేస్తారు. ఈ ప్రక్రియ ముగియగానే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 21 నాటికి ముగించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఉగాది తర్వాత ఇంటర్ ఫలితాల ప్రకటన తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఫలితాలను అధికారులే ప్రకటించనున్నారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2024 ఎలా చెక్ చేసుకోవాలి?
Step 1 : టీఎస్ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in పై క్లిక్ చేయండి.
Step 2 : హోమ్‌పేజీలో “TS Inter 2024 Results” లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3 : విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన రోజు వివరాలతో లాగిన్ చేయాలి.
Step 4 : విద్యార్థి ఇంటర్ ఫలితాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి.
Step 5 : ఫలితాలను చెక్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోండి.
టీఎస్ టెన్త్ ఫలితాలు
ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసారి టీఎస్ పదో తరగతి ఫలితాలు కాస్త ముందుగానే రానున్నాయి. ఈ నెల 11వ తేదీతో స్పాట్ వాల్యూయేషన్ పూర్తి కానుండగా…. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి పరీక్షలు తొందరగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు పరీక్షలు జరగాయి. ఫలితాలను మే 10న ప్రకటించారు. అయితే ఈసారి మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు పూర్తైన 25 నుంచి 30 రోజుల వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్ చివరి వారంలోనే తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. వివరాలు కంప్యూటరీకరణ ఆలస్యం అయితే మే తొలి వారంలో ఫలితాలు ప్రకటించే ఛాన్స్ ఉంటుంది
20 తర్వాత ఇంటర్ ఫలితాలు
- Advertisement -
- Advertisement -