- Advertisement -
తెలంగాణలో ఉన్న అన్నిమున్సిపాలిటీలకు మరియు కార్పొరేషన్ ల లో ఆస్తి పన్ను లో వడ్డీ మాపి చేయాలనీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ *
Interest on property tax should be waived for municipalities and corporations: Challa Harishankar
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలో ఆస్తిపన్నులపై ఉన్న వడ్డీ మాపి పథకాన్ని ప్రకటించాలని బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు.మంగళవారం రోజున నగరంలోని 37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి జిహెచ్ఎంసి పరిధిలోని ఇళ్లకు మాత్రమే వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. మిగిలిన మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంక్షేమ పరిస్థితుల్లో మధ్యతరగతి సామాన్య ప్రజలు ఇంటి పన్నులు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలని కోరారు. నగరంలో సామాన్యులు మధ్యతరగతి ఇంటి యజమానులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇంటి పన్నులు వసూలు చేస్తున్న నగరపాలక అధికారులు లక్షల్లో బకాయిలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయం రావలసిన ఆస్తి పన్నులను వసూలు చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు పన్నులు చెల్లించాల్సి ఉన్న సామాన్య మధ్యతరగతి యజమాన్యాలపై వడ్డీ మాఫీ పథకం వచ్చేవరకు ఒత్తిడి తీసుకురావద్దని కోరారు పకడ్బందీగా వసూలు చేసేందుకు ఆసక్తి చెబుతున్న అధికారులు ఆయా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు నగరంలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదని పారిశుద్ధ్యం కూడా అంతంత మాత్రాగానే ఉందన్నారు వేసవికాలం ప్రారంభానికి ముందే పలుకానిలల్లో రోజు తప్పించే రోజు నీటి సరఫరా సాగుతుందని రానున్న రోజుల్లో మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. నగరపాలక సంస్థ చెందిన అధికారులు ఇంటి పన్ను వసూళ్ల విషయంలో పెట్టిన దృష్టి మౌలిక సదుపాయాల కల్పించడం విషయంలో కూడా దృష్టి సారించాలని కోరారు. ఇట్టి ప్రెస్మీట్లో బిఆర్ఎస్ పార్టీ నగర యూత్ ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయి కృష్ణ గారు కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు గారు బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆరె రవి గౌడ్ గారు చేతి చంద్రశేఖర్ గారు జెల్లోజి శ్రీనివాస్.



- Advertisement -