Sunday, September 8, 2024

ఆసక్తికరంగా జగిత్యాల రాజకీయం

- Advertisement -

వరంగల్, నవంబర్ 7, (వాయిస్ టుడే ):  జగిత్యాల జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మూడు నియోజకవర్గాల్లో ఈసారి రెండు చోట్ల ట్రయాంగిల్ ఫైట్ ఉంటే.. మరోచోట ఇద్దరు నాయకుల మధ్య హోరాహోరీ తప్పదు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో ఒక్క బీజేపీ మినహా మిగిలిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను పెద్దగా మార్చలేదు. ఒక్క కోరుట్ల బీఆర్ఎస్ టికెట్ మాత్రం ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ సంజయ్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పోరాడి ఓడిన కాంగ్రెస్ నాయకులు ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు.అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈసారి కూడా ప్రజలు తమకే పట్టం కడతారని ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉండగా బీసీ వాదం అందుకున్న బీజేపీ అధిష్టానం కోరుట్ల, జగిత్యాలలో బీసీ అభ్యర్థులను బరిలో ఉంచింది. పై చేయి సాధించేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. మూడు పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. లీడర్లు చేస్తున్న ప్రయత్నంలో ఓటర్లు ఏ పార్టీ వైపు నిలబడతారు అన్నది అంచనాలకు అందకుండా ఉంది. దానికి తోడు ఎప్పటికప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతూ ఉండడం లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.జగిత్యాల నియోజకవర్గంతో పాటు కోరుట్లలో ఈసారి త్రిముఖ పోటీ తప్పేలా లేదు. గతంలో జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్యనే ప్రధానంగా పోటీ ఉండేది. అయితే ఈసారి బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గతంలో కోరుట్లలో సైతం బీఆర్ఎస్ అభ్యర్థి విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు మధ్యనే పోటీ ఉంది.ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బీజేపీ నుంచి ఎంపీ అరవింద్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి జువ్వాడి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోరుట్లలో కూడా పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. రెండు నియోజకవర్గాల్లో మూడు పార్టీల నుంచి అభ్యర్థులు బలంగా ఉండడంతో గెలుపు ఎవరిని వరిస్తుందో అన్నది అంచనాలకు అందకుండా ఉంది.ఎస్సీ రిజర్వుడ్‌గా ఉన్న ధర్మపురిలో పోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా నెక్ టు నెక్ ఫైట్ జరిగింది. ఉత్కంఠగా సాగిన లెక్కింపులో కొప్పులను స్వల్ప తేడాతో విజయం వరించింది. అయితే ఈసారి కూడా ధర్మపురి నియోజకవర్గం మరో ఆసక్తికర పోరుకు వేదిక కానుంది. సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి ఖచ్చితంగా తనని గట్టేక్కిస్తాయని మంత్రి కొప్పుల భావిస్తుండగా ఎలా అయినా విజయం సాధించాలని దానికి తోడు సింపతీ కూడా వర్క్ ఔట్ అవుతుందని అడ్లూరి అంతే ధీమాతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉందిఅభివృద్ధి, సంక్షేమ పథకాలు మళ్లీ తమకే పట్టం కడతాయని బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఆ పార్టీ హైకమాండ్ బలంగా నమ్ముతోంది. ఆరు గ్యారెంటీలతో ప్రచారంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల పవనాలు ఉండడంతో గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారు. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి కోరుట్ల, జగిత్యాల బరిలో ఆ పార్టీలు ఓసీ సామజికవర్గ నాయకులను బరిలో ఉంచింది. అయితే బీజేపీ మాత్రం ఈ రెండు స్థానాల్లో బీసీ లీడర్లను పోటీలో ఉంచింది. రెండు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్న పద్మశాలి, మున్నూరుకాపు, ఇతర బీసీ కులాలను ప్రసన్నం చేసుకునేందుకే ఈ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్