1.4 C
New York
Monday, February 26, 2024

రూ.47.66లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్‌..

- Advertisement -

రూ.47.66లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్‌..
న్యూ డిల్లీ ఫిబ్రవరి 1
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌. కేంద్ర బడ్జెట్‌లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చేశారు. బడ్జెట్‌ పరిమాణం మొత్తం రూ.47.66లక్షల కోట్లు కాగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు. బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు. ఆయన ప్రధాని అయ్యాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని.. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ మంత్రంతో ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొన్నట్లు వివరించారు.
బడ్జెట్‌లో వివిద శాఖలు.. పథకాలకు కేటాయింపుల ఇలా..
మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు
రక్షణశాఖకు రూ.6.2లక్షల కోట్లు
రైల్వేశాఖకు రూ.2.55లక్షల కోట్లు
హోంశాఖకు రూ.2.03లక్షల కోట్లు
వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.77లక్షల కోట్లు
ఉపరితల రవాణా, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2.78లక్షలకోట్లు
ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2.13లక్షల కోట్లు
రసాయనాలు, ఎరువుల కోసం రూ.1.68లక్షలకోట్లు
కమ్యూనికేషన్‌ రంగానికి రూ.1.37లక్షలకోట్లు
గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.86వేలకోట్లు
ఆయుష్మాన్‌ భారత్‌ పథకానికి రూ.7500కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.6,200కోట్లు
సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6,903కోట్లు
సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌కు రూ.8500కోట్లు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!