తెలంగాణ భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
హైదరాబాద్ మార్చ్ 8
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. సమ్మక్క, సారలమ్మ, రుద్రమదేవిలా మహిళలు పోరాటం చేయాలన్నారు.అంతకుముందు.. ‘ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించి మహిళా హక్కుల పోరాటాలకు స్పూర్తినింపిన మహిళా దినోత్సవం నేడు. ఆ స్పూర్తిని ఎత్తిపడుతూ హక్కులను సాధించుకుందామని తెలియజేస్తూ నారీ లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
తెలంగాణ భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- Advertisement -
- Advertisement -