Sunday, September 8, 2024

ప్రకృతి ప్రకోపం కంటే ఆక్రమణల వల్లే ఎక్కువ నష్టం

- Advertisement -

వరంగల్‌ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళిసై పర్యటన

invasion-causes-more-damage-than-natures-fury
invasion-causes-more-damage-than-natures-fury

వరంగల్, ఆగస్టు 2, (వాయిస్ టుడే): వరంగల్‌, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె.. శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్‌, ఎన్ఎన్ నగర్‌ ప్రాంతాల్లో బాధితులను ఆమె పరామర్శించారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ సమకూర్చిన హెల్త్ కిట్స్‌, నిత్యావసరాలను వరద బాధితులకు గవర్నర్ తమిళిసై పంపిణీ చేశారు. వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. సాయమందేలా చూస్తానని తమిళిసై హామీ ఇచ్చారు.

invasion-causes-more-damage-than-natures-fury
invasion-causes-more-damage-than-natures-fury

ఈ సందర్భంగా భద్రకాళి చెరువు కట్ట మరమ్మతుల పనులను గవర్నర్ తమిళిసై పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వరద ప్రభావం వరంగల్ లో దారుణంగా ఉంది.. భారీ వరదలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలి అని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని తమిళిసై అన్నారు. ప్రకృతి ప్రకోపం కంటే ఆక్రమణల వల్లే ఎక్కువ నష్టం జరిగింది అని గవర్నర్ తమిళిసై అన్నారు. వర్షంతో పాటు ఆక్రమణల కారణంగా ఎక్కువ ముంపు జరిగింది.. స్వచ్ఛమైన తాగునీరు, మెడికల్ కిట్స్ ప్రభుత్వం అందించాలి అని ఆమె అన్నారు. కేంద్ర బృందం పర్యటిస్తూ వరద నష్టాన్ని అంచనా వేస్తోంది.. బాధితులకు నిత్యావసర సరుకులు అందించినందుకు రెడ్ క్రాస్ సంస్థకు ధన్యవాదాలు అని గవర్నర్ తమిళిసై చెప్పారు.

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్