Wednesday, January 15, 2025

టీటీడీ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరపండి

- Advertisement -

టీటీడీ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరపండి

Investigate the TTD case with the CBI

ఏపీ సీఎంకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ
హైదరాబాద్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ లేఖ రాసారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోంది. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదు. ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదు.  ‘జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని మీరు(చంద్రబాబు) చేసిన వ్యాఖ్యలతో లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోంది.  లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచం.  హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే భావిస్తున్నామని అన్నారు.
లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడానికి, టీటీడీపై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేశారు. క్షమించరాని నేరానికి ఒడిగట్టారు. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం, అన్యమతస్తులకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించడంవల్లే ఈ దుస్థితి

ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయం లేనిదే ఏళ్ల తరబడి ఈ కల్తీ దందా జరిగే అవకాశం లేదు. సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందిఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే.  రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోండని కోరారు.
హిందూ ధార్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం కూడా పూర్తిగా నిషిద్ధం.  దేవుడిపై నమ్మకం లేని నాస్తికులకు, అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడంవల్లే తిరుమల కొండపై అన్యమత ప్రచారానికి ఆస్కారం ఏర్పడుతోంది. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించకుండా, అన్యమతస్తులకు టీటీడీలో ఉద్యోగాలివ్వకుండా కఠినమైన చట్టాలు తీసుకురండి. తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయండని అయన లేఖలో పేర్కోన్నీరు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్