తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన
హైదరాబాద్ మార్చ్ 12
తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతుండటంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేన్స్ కంపెనీ గుజరాత్‌కు తరలిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయని, ఆ కంపెనీ పెట్టుబడులను ఇక్కడే కొనసాగించేలా రాష్ట్రం ఒప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ (X) హ్యాండిల్‌లో ఒక పోస్టు పెట్టారు. కేన్స్ కంపెనీ గుజరాత్‌కు తరలిపోతున్నట్టు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్ ఆయన షేర్ చేశారు.రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు మేం చేసిన కృషి నిష్ఫలం అవుతున్నది. కేన్స్ కంపెనీ గుజరాత్‌కు వెళ్లిపోతున్నట్లు వార్తలు వస్తునాయి. ఎంతో ప్రయత్నించి కేన్స్ కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చేలా కన్విన్స్ చేశాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆ కంపెనీని ఒప్పించాం. ఫాక్స్‌కాన్ దగ్గరలో ల్యాండ్ కావాలంటే 10 రోజుల్లోనే భూమి కేటాయించాం. కేన్స్ కంపెనీ వస్తే సెమీకండక్టర్ రంగంలో ఎంతో పురోగతి ఉంటుంది. పెట్టుబడులు ఇక్కడే కొనసాగించేలా కేన్స్ కంపెనీని రాష్ట్రం ఒప్పించాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి

- Advertisement -
- Advertisement -