Monday, December 23, 2024

రాముడి భక్తులకే  ఇన్విటేషన్స్

- Advertisement -

రాముడి భక్తులకే  ఇన్విటేషన్స్

అయోధ్య, జనవరి 1

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి  అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే వేలాది మందికి ఆహ్వానం అందింది. అయితే…ఈ ఇన్విటేషన్‌ల విషయంలో కాస్త రాజకీయ రగడ కొనసాగుతోంది. కొంతమంది కీలక నేతలు తమకు ఆహ్వానం అందలేదని అసహనంతో ఉన్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇన్విటేషన్ పంపలేదని చెప్పారు. ఈ వివాదంపైనే   ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. కేవలం రాముడి భక్తులకు మాత్రమే ఇన్విటేషన్‌లు పంపామని తేల్చి చెప్పారు. రాముడి పేరు చెప్పుకుని బీజేపీ రాజకీయాలు చేస్తుందన్న విమర్శల్నీ కొట్టిపారేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఆయనను గౌరవిస్తున్నారని అన్నారు.
“అయోధ్య ఉత్సవానికి కేవలం రాముడి భక్తులకు మాత్రమే ఆహ్వానం పంపాం. రాముడి పేరు చెప్పుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందనడంలో ఎలాంటి అర్థం లేదు. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా గౌరవం లభిస్తోంది. ఇన్నేళ్ల హయాంలో ఆయన ఎన్నో గొప్ప పనులు చేశారు. ఇది రాజకీయం చేయాల్సిన విషయం కాదు. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం అని గుర్తుంచుకోవాలి”
– ఆచార్య సత్యేంద్ర దాస్, అయోధ్య రామ మందిర పూజారి
థాక్రేపై ఫైర్..
అంతకు ముందు ఉద్ధవ్ థాక్రే బీజేపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాముడి పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని మండి పడ్డారు. మందిర ఉత్సవాన్ని కేవలం ఓ పార్టీకే పరిమితం చేయడమేంటని ప్రశ్నించారు. ఏదేమైనా అయోధ్య రాముడి కోసం మందిరం కట్టడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అయితే…ఆయనకు ఆహ్వానం అందలేదన్న విమర్శలపై మండి పడ్డారు సత్యేంద్ర దాస్. “రాముడి పేరు చెప్పుకుని ఒకప్పుడు వాళ్లూ రాజకీయాలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ విషయం బహుశా ఉద్ధవ్ థాక్రే మర్చిపోయారేమో. రాముడిని నమ్ముకున్న వాళ్లే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అయినా ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకోనవసరం లేదు”
–  ఆచార్య సత్యేంద్ర దాస్, అయోధ్య రామ మందిర పూజారి
అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్ పేరు చెప్పి కొందరు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. ఎలాంటి అప్రూవల్ లేకుండానే కొందరు QR Codeల ద్వారా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్రహోం శాఖకూ ఫిర్యాదులు అందించింది. ఆ వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. X లో అధికారికంగా ఓ పోస్ట్ పెట్టింది. విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ అందరినీ అలెర్ట్ చేశారు. అలాంటి మాయగాళ్ల వలలో చిక్కుకోవద్దని సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్