కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఐపిఎస్ అధికారుల సంఘం
IPS officers association condemned KTR's comments
హైదరాబాద్
సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై సిరిసిల్ల ఎమ్మెల్యే చేసిన అవమానకర వ్యాఖ్యలను తెలంగాణ ఐపిఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై సిరిసిల్ల శాసనసభ్యులు కె.తారక రామారావు చేసిన అవమానకరమైన మరియు నిరాధార ఆరోపణలను తెలంగాణ ఐపిఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు ఆయన నిష్పక్షపాతం మరియు విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా ఉన్నాయి.ఈ వ్యాఖ్యలు పాలనా విధానాలు మరియు రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయి.
ప్రజాసేవలో అధికారి విధులను నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఊహించని ఇటువంటి నిరాధార ఆరోపణలు బాధ్యతారాహిత్యమైనవిగా, ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఈ సందర్భంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు పూర్తి మద్దతు తెలియజేస్తుంది. సివిల్ సర్వీసు అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి తాము అండగా నిలబడతామని సంఘం స్పష్టం చేస్తోంది. కలెక్టర్ విధి నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీయడంతో పాటు, పాలన పట్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి.
అందువల్ల, ఇటువంటి నిరాధార ఆరోపణలను వెంటనే నిలిపివేయాలని, వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐపిఎస్ అధికారుల సంఘం పిలుపునిస్తోందని ఒక ప్రకటనలో పేర్కోంది.


