Sunday, September 8, 2024

కేయూ  పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు ..!

- Advertisement -

వివాదమవుతున్న కేయూ పిహెచ్డీ వ్యవహారం

విద్యార్ది నేతలకు గాయాలు, అందోళన ఉదృతం చేస్తామన్న ఏబీవీపీ

వరంగల్:  వరంగల్ లో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన రాజకీయంగా దుమారం రేపుతుంది. పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆందోళన దిగి విసి, ప్రిన్సిపల్ కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన కేసులో ఏడుగురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు రిమాండ్ కు తరలించారు. అయితే విద్యార్థులు చేతులకు కాళ్ళకు కట్లు కట్టుకొని పోలీసులు కొట్టారని ఆందోళన దిగడం విపాదాస్పదంగా మారింది. విద్యార్థులను తాము కొట్టలేదని, చట్టాన్ని చేతిలో తీసుకొని దాడులు చేస్తామంటే ఊర్కోబోమని సిపి రంగనాథ్ హెచ్చరించారు. పీహెచ్డీ సీట్ల భర్తీ ప్రతిభ ఆధారంగానే జరిగిందని ఎలాంటి అవకతవకలు జరగలేదని వీసి రమేష్ స్పష్టం చేశారు.

irregularities-in-ku-phd-admissions
irregularities-in-ku-phd-admissions

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన, దాడి, పోలీసుల అరెస్టు వివాదాస్పదంగా మారింది. పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని అడ్మిషన్లు రద్దుచేసి కొత్తగా షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ, బిసి విద్యార్థులు మూడు రోజుల క్రితం ఆందోళన దిగారు. ఆందోళనలో భాగంగా విసి, ప్రిన్సిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లి పర్నిచర్ ద్వంసం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు దాడి చేసిన వారిపై  చేయి చేసుకుని బలవంతంగా స్టేషన్ తరలించారు.

ఏడుగురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా ఏబీవీపీ విద్యార్థులు సిపి పర్యవేక్షణలో టాస్క్ఫోర్స్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టారని మెజిస్ట్రేట్ ముందు చెప్పారు. మెజిస్ట్రేట్ మళ్ళీ వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించడంతో పోలీసులు ఎంజీఎం కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కాళ్ళకు చేతులకు గాయాలయ్యాయని సిమెంట్ పట్టీలు వేశారు వైద్యులు. కట్లు చూసి పోలీసులు బాగానే కొట్టి ఉంటారని గాయపడ్డ వారికి సంఘీభావంగా కేయు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ లో ఆందోళనకు దిగారు. వారికి బిజేపి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు.  విద్యార్దులను కొట్టి తేనె తెట్టేను తట్టి లేపారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని గద్దె దించేదాక,  విద్యార్దుల న్యాయమైన డిమాండ్ పరిష్కారం అయ్యేవరకు వెనక్కి తగ్గొద్ధని అండగా ఉంటామని బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి హామీ ఇచ్చారు.

irregularities-in-ku-phd-admissions
irregularities-in-ku-phd-admissions

విద్యార్థుల ఆందోళన, రాజకీయ పార్టీల ఆగ్రహంతో వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్,  పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ మీడియా ముందుకు వచ్చారు. విద్యార్థులను కొట్టలేదని, వారు చేసే ఆరోపణలో వాస్తవం లేదని సిపి రంగనాథ్ స్పష్టం చేశారు. నేను దగ్గరుండి టాస్క్ ఫోర్స్ పోలీసులచే కొట్టించానని, గన్ పెట్టి బెదిరించానని చెప్పడం అబద్దమన్నారు. కొంతమంది ఏబీవీపీ విద్యార్థులు వీసీ చాంబర్ డోర్ పగలగొట్టి, కంప్యూటర్లు ధ్వంసం చేయడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగిందని తోపులాటలో స్వల్ప గాయాలు అయ్యాయే తప్ప తాము విద్యార్థులను కొట్టలేదన్నారు. తమను పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ ముందు చెప్పి, పాత గాయాలు చూపించి జడ్జిని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సిపి తెలిపారు. చట్టాన్ని చేతిలోకి  తీసుకుని దాడులు చేస్తే ఊరుకోబోమని ముందే హెచ్చరించినా విద్యార్థులు పట్టించుకోలేదన్నారు. కేయూలో తప్పులు జరిగితే ప్రశ్నించాలి, లీగల్ గా పోరాడాలి, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేస్తామంటే చూస్తు ఊర్కోబోమని సిపి హెచ్చరించారు

కేయూ పిహెచ్డీ  కేటగిరి-2 అడ్మిషన్ లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ స్పష్టం చేశారు. పారదర్శకంగా ప్రతిభ ఆధారంగానే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించామని చెప్పారు. దౌర్జన్యం చేస్తే పాలకవర్గం లొంగుతుందని కొందరు భావిస్తున్నారని, అలాంటి బెదిరింపులకు భయపడమన్నారు. మాకు కులం, మతంతో సంబంధం లేదని, రూల్స్ కు అనుగుణంగానే సీట్లు కేటాయించామని స్పష్టం చేశారు. డోర్లు తన్నుకుంటు, అసభ్యపదజాలంతో నా చాంబర్ కు వచ్చి కొందరు విద్యార్థులు గలాటా చేశారని చెప్పారు. అక్రమ మార్గంలో పిహెచ్డీ  అడ్మిషన్లు పొందేందుకు కొందరు మెరిట్ లేని వారు ఆందోళనతో యూనివర్సిటీని అభాసు పాలు చేస్తున్నారని కేయూ విసి డాక్టర్ తాటికొండ రమేష్ అంటున్నారు.  విద్యార్థుల ఆందోళన, అరెస్టు, గాయాలు, పోలీసులపై విమర్శలు, విసిపై ఆరోపణలు వివాదాస్పదమై రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్