Wednesday, March 11, 2026

గ్రేటర్ లో పట్టు సాధ్యమేనా

- Advertisement -

గ్రేటర్ లో పట్టు సాధ్యమేనా
హైదరాబాద్, మార్చి 10, (వాయిస్ టుడే )

Is Gaining a Foothold in the Greater Region Possible?
తెలంగాణ రాజకీయాలకు గుండెకాయ వంటి హైదరాబాద్‌లో ఇప్పుడు ముందస్తు రాజకీయ వేడి రాజుకుంది. మొన్నటి వరకు ఒకే గొడుగు కింద ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు మూడు

ముక్కలు (హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్) కావడంతో, పాత సమీకరణాలు చెదిరి కొత్త పొత్తులు, ఎత్తుగడలకు తెరలేచింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, దూకుడు మీదున్న బీజేపీల మధ్య నలిగిపోతున్న భారత్

రాష్ట్ర సమితి  నేతలు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్కచూపులు చూస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించాలని నిర్ణయించడం ఈ మొత్తం గందరగోళానికి ప్రధాన కారణం.

150 డివిజన్లతో హైదరాబాద్, 74 డివిజన్లతో మాల్కాజిగిరి, 76 డివిజన్లతో సైబరాబాద్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం డివిజన్ల సంఖ్య 150 నుంచి 300కి పెరగడం, సరిహద్దుల

పునర్విభజన జరగడంతో చాలామంది సిట్టింగ్ కార్పొరేటర్లకు తమ పట్టున్న ప్రాంతాలు చేజారుతాయనే భయం పట్టుకుంది. ఈ రీ-ఆర్గనైజేషన్ వల్ల గ్రామీణ ప్రాంతాలు పట్టణ కార్పొరేషన్లలో కలవడంతో ఓటు బ్యాంకు

సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 99 సీట్లు, 2020లో 56 సీట్లకు పరిమితమైంది. ఒకప్పుడు జీహెచ్‌ఎంసీపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన బిఆర్ఎస్ పరిస్థితి

రోజురోజుకూ దిగజారుతూ వస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీలో నైతిక స్థైర్యం దెబ్బతింది.ఈ తరుణంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి ‘ఆపరేషన్ ఆకర్ష్’కు పదును పెట్టాయి. అధికారంలో

ఉండటం వల్ల నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల ఆశ చూపి  నేతలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ వంటి కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం పార్టీకి పెద్ద దెబ్బ. పట్టణ ప్రాంతాల్లో

తమకున్న పట్టును మరింత పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవడం ఆ పార్టీకి కొండంత బలాన్నిచ్చింది. గులాబీ పార్టీ నుండి అసంతృప్త నేతలను

చేర్చుకుని, 300 డివిజన్లలో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లు, టికెట్ ఆశావహులు తమ అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. “గులాబీ పార్టీలో

ఉంటే భవిష్యత్తు ఉంటుందా? లేక కాంగ్రెస్, బీజేపీలలో చేరి టికెట్ హామీ పొందాలా?” అనే సందిగ్ధంలో వారున్నారు. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం నాటికి మెజారిటీ నేతలు తమ పార్టీ మార్పుపై ఒక

స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు బీఆర్ఎస్ కేడర్‌ను కాపాడుకోవడం ఆ పార్టీకి ఇప్పుడు కత్తిమీద సామేనని చెప్పొచ్చు. కొత్త అభ్యర్థులను వెతుక్కోవడం, ఉన్నవారిని

బుజ్జగించడం నాయకత్వానికి సవాలుగా మారింది. ప్రభుత్వం ఉన్నప్పటికీ, హైదరాబాద్ నగర పరిధిలో క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం బలహీనంగా ఉంది. వచ్చే ‘రెడీమేడ్’ నేతలే వీరికి ఆధారం. ఇక పట్టణ ఓటర్లు

బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నా, 300 మంది సమర్థవంతమైన అభ్యర్థులను వెతకడం వారికి పెద్ద టాస్క్.మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు రాజకీయ చదరంగంగా మారింది. మూడు కార్పొరేషన్ల ఏర్పాటు కేవలం

పాలనా సౌలభ్యం కోసమేనా లేక రాజకీయంగా గులాబీ పార్టీకిను దెబ్బతీయడానికా అన్నది పక్కన పెడితే.. ఈ వలసల పర్వం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. రాబోయే కార్పొరేషన్

ఎన్నికలే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్స్‌గా మారనున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్