ఈయన ఒక సర్పంచా లేక   వీధి రౌడా…?

- Advertisement -

తన సొంత భూమి లోకి వచ్చి కడీలు ఇరగొట్టి….

దౌర్జన్యానికి దిగుతున్న ములకలపల్లి సర్పంచ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

రైతు బాధితుడు గుండెబోయిన నరసింహులు

సర్పంచ్ దౌర్జన్యం ఆపీ నా భూమి నాకు ఇప్పించండి…

లేకుంటే ఆత్మహత్యే శరణ్యం

భువనగిరి ( వాయిస్ టుడే ప్రతినిధి):- ఈయన ఒక సర్పంచా  లేక వీధి రౌడీనా అని, తమ సొంత భూమిలోకి వచ్చి మహిళలపై దౌర్జన్యం చేస్తున్న ఈ రౌడీ సర్పంచ్ పై రెవిన్యూ,పోలీస్ అధికారులు చట్టారీత్య చర్యలు తీసుకోవాలని  ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో సర్వే నెంబరు. 33 లో గుండెబోయిన నరసింహులు కు ఉన్న ఎకరం భూమిలో సాగు చేస్తున్నాడు. ఇటీవల బతుకు తెరువు కోసం బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపురం పోయి అక్కడ పాలేరుగా పనిచేస్తున్నాడు. ఇదే అదునుగా భావించిన ములకలపల్లి సర్పంచ్, అతని పాలివాళ్లు, వ్యవసాయదారుడు గుండెబోయిన నరసింహులు నాటుకున్న కడీలు తొలగించి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని బాదితుడు గుండబోయిన నర్సింహులు తెలిపారు. ఇదేమిటని అడిగితే సంబంధిత ములకలపల్లి సర్పంచ్ ఇమ్మడి మల్లప్పఅను వ్యక్తి వ్యవసాయ కుటుంబీకుడు బాధితుడైన గుండెబోయిన నర్సింహులు అతని కుటుంబీకులపై దాడి చేస్తూ అతని నోటికి వచ్చిన మాటలు తిడుతూ దుర్భాషలాడుతూ  నెట్టి వేస్తున్నాడని నర్సింహులు ఆరోపిస్తున్నారు. తమ ల్యాండ్ ను తమకు ఇప్పించి ఈ బీద కుటుంబాన్ని ఆదుకోవాలని లేకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని, బాధితులు ప్రాధేయపడుతున్నారు… ఈ విషయంపై రెవెన్యూ పోలీస్ అధికారులు చొరవ తీసుకొని, సంబంధిత సర్పంచ్ పై చట్టరీత్య చర్యలు తీసుకుని, బాధితునికి తగు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొసమెరుపు…. కాగా ఈ సర్పంచ్ అధికార పార్టీ చెందినవారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular